పెద్దనోట్ల రద్దు నిర్ణయం గ్రామీణ వ్యవస్థను అతలా కుతలం చేసింది. గ్రామీణ బ్యాంకుల సంఖ్య తగ్గడం, సహకార రంగాన్ని ప్రభుత్వం విస్మరించడం, సరిపడా ఎటిఎంలు లేకపోవడం వంటి కారణాలతో గ్రామీణ ప్రజానీకానికి పాతనోట్లు మార్చుకోవడంతోపాటు, వందనోట్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. రబీ సీజన్ ప్రారంభానికి ముందు వెలువడిన నిర్ణయంతో దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట చేతికి వచ్చింది. కూలీలు వున్నారు కాని పంటకోయాలి అంటే కూలీలు చిల్లర ఇస్తేనే వస్తామంటున్నారు. రబీ పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనడానికి వారి వద్ద డబ్బుల్లేవు. బ్యాంకులు కూడా రైతులకు రుణాలు యివ్వడానికి ముందుకురావడంలేదు. ఈ ప్రభావం వ్యవసాయ కూలీల మీద కూడా త్రీవంగా పడుతోంది. మారుమూల గ్రామాల్లో నెలకొనే ఈ పరస్థితులను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైది.
No comments:
Post a Comment