Thursday, December 8, 2016



నగదు రహిత లావాదేవీల అంతిమ పర్యవసానం పేదలు, రైతులు, చిన్న మధ్యతరగతి వ్యాపారులు దెబ్బతినిపోవడమే. వ్యవసాయరంగం కార్పొరేటీకరణ, చిన్న మధ్యతరగతి వ్యాపారాలన్నీ దెబ్బతిని బడా మాల్స్, సూపర్ మార్కెట్స్ కే లాభం చేకూరుతుంది. ఇప్పటికే దేశంలో అన్ని రాష్ర్టాల్లోరబీ పంట వేసిన రైతులు వద్ద నగదు లేక, అప్పు పుట్టక నానా యిబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే రైతులకు వ్యవసాయం మానుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి.
పాలకులు పెద్ద నోట్లు రద్దుచేసి తప్పుచేసింది. ప్రజలకు ఇబ్బందులు కలిపించి ప్రజల దృష్టి ప్రక్కకు మల్లించేందుకు,  నగదు రహిత లావాదేవీలు. దీని  ద్వారా మరో తప్పుచేస్తుంది. దీనివల్ల సైబర్ నేరాలు పెరుగుతాయి. దీనిని నివారణకు సరైన వ్యవస్థ లేదు. ఇంకా అనేక సమస్యలు తలయెత్తతాయ్.  పాలకులు ఒక తప్పును సరిచేసుకోలేక మరో తప్పు చేయడానికి సిద్ధపడుతుంది.  ఇవ్వని ప్రపంచబ్యాంకు విధానాలు. ప్రపంచబ్యాంకు వద్ద మెప్పు పొందేందుకు పాలకులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.  
పాలకులు పెద్ద నోట్లు రద్దుచేసి తప్పుచేసింది.  ఇప్పుడు మరలా ప్రజలకు ఇబ్బందులు కలిపించి ప్రజల దృష్టి ప్రక్కకు మల్లించేందుకు,  నగదు రహిత లావాదేవీలు. దీని  ద్వారా మరో తప్పుచేస్తుంది. దీనివల్ల సైబర్ నేరాలు పెరుగుతాయి. దీనిని నివారణకు సరైన వ్యవస్థ లేదు. ఇంకా అనేక సమస్యలు తలయెత్తతాయ్.  పాలకులు ఒక తప్పును సరిచేసుకోలేక మరో తప్పు చేయడానికి సిద్ధపడుతుంది.  ఇవ్వని ప్రపంచబ్యాంకు విధానాలు. ప్రపంచబ్యాంకు వద్ద మెప్పు పొందేందుకు పాలకులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోట్ల రద్దు నిర్ణయం తరువాత మొబైల్‌ బ్యాంకింగ్‌ అంటూ మరో కొత్త పాట పాడుతున్నాయి. భారతదేశంలో 68 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. అందులో 60 శాతం మందికి కనీసం సంతకం చేయడం కూడా రాదు. సెల్‌ఫోన్‌ వాడడం కూడా రాని వారు మొబైల్‌ బ్యాంకింగ్‌ను ఎలా ఉపయోగించుకోగలరు. మొబైల్‌ బ్యాంకింగ్‌ వల్ల బ్యాంకు సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది. స్వైపింగ్‌ మిషన్లతో కొనుగోళ్ల బిల్లులు చెల్లించడంలో సామాన్యులు ఆదమరిస్తే వ్యాపారులు ఎక్కువ సొమ్మును తమ ఖాతాల్లోకి మార్చుకుని, మోసాలకు పాల్పడే అవకాశాలూ లేకపోలేదు.

Wednesday, November 30, 2016




 'నోట్ల రద్దు' నిరంకుశత్వం
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ ||
కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నిరంకుశ చర్య అని ప్రముఖ ఆర్థికవేత్త, భారతరత్న, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ అభివర్ణించారు. కొంతకాలంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను మోడీ మళ్లీ వెనక్కి తీసుకెళ్లారని ఆయన విమర్శించారు. అమర్త్యసేన్‌ బుధవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. కేంద్రం నిర్ణయం నమ్మకంపై ఆధారపడిన ఆర్థిక మూలా లకు అడ్డుకట్ట వేసే చర్య అని అన్నారు. బ్యాంకులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని మోడీ నిర్ణయం బలహీనప రిచిందని, ప్రజల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిందని తెలిపారు. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థకు పెను విపత్తుగా మారే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ విధానానికి తానేమీ అనుకూలం కాదని ఆయన స్పష్టం చేశారు. నల్లధనంపై పోరాటాన్ని అందరితో పాటు తాను కూడా స్వాగతిస్తానని చెప్పారు. నల్లధనం అతి కొద్ది మంది చేతుల్లోనే ఉన్నదని, దానిని వెలికి తెచ్చేందుకు చిన్న చర్య చేపడితే చాలన్నారు. కానీ దేశ ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేసేలా మోడీ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. నల్లధనంపై జరిగే పోరాటం తెలివైనదిగా, మానవత్వం కలిగినదిగా ఉండాలన్నారు. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక ఇవేమీ లేవన్నారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటికొస్తుందని, అవినీతి అంతమవుతుందని తాను నమ్మడం లేదని చెప్పారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని త్వరలోనే వెనక్కి రప్పిస్తామని మోడీ గతంలో చెప్పారని, ఆ విషయంపై ఇంతవరకు పురోగతి లేదని చెప్పారు. నోట్ల రద్దు నేపథ్యంలో మోడీ ఇస్తున్న హామీలది కూడా ఇదే పరిస్థితి అని తెలిపారు. కేంద్రం నిర్ణయంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
clip

Sunday, November 27, 2016



|| రెడ్‌ సెల్యూట్‌ కామ్రేడ్‌ కాస్ట్రో ||
ఒక మహా వృక్షం నేలకొరిగింది. ఒక మహా మనిషి భౌతిక జీవితం నుండి నిష్క్రమించాడు. ఫైడల్‌ కాస్ట్రో అనే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు ఇకపై ప్రపంచ మానవాళికి స్ఫూర్తిగానే మిగులుతాడు. 90 ఏళ్ల నిండు జీవితాన్ని అత్యంత ఆదర్శవంతంగా, ప్రయోజనకరంగా గడిపిన కాస్ట్రో మరణించారన్న వార్త ప్రపంచ పీడిత ప్రజలను దిగ్భ్రాంత పరిచింది. దేశాధినేతలే కాదు ప్రపంచమంతటా ప్రజలు ఆ కమ్యూనిస్టు నేత మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కోటిమంది ప్రజలున్న ఒక చిన్న దేశమైన క్యూబా నేత మరణ వార్త ప్రపంచ వ్యాపితంగా ఇంతటి ప్రభావం చూపించడానికి కారణం ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆ సిద్ధాంతం కోసం ఆటుపోట్లనెదుర్కొని ఆయన నిలబడిన తీరు, తను నిలబడడమే కాకుండా ''రానీ రానీ కష్టాల్‌ నష్టాల్‌ కోపాల్‌ తాపాల్‌ శాపాల్‌ రానీ'' అని శ్రీశ్రీ రాసినట్లు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు జరిగినా సామ్రాజ్యవాదానికి దాసోహం కాబోము, సోషలిజాన్ని విడనాడబోము అని తన దేశ ప్రజలను నిలబెట్టిన తీరు. మంకాడా తిరుగుబాటు విఫలమైన తరువాత అరెస్టయి కోర్టు విచారణ నెదుర్కొన్న కాస్ట్రో సామ్రాజ్యవాద పదఘట్టనలకింద పడి నలిగిపోతున్న క్యూబన్ల విమోచన కోసం తను చేసిన పని తప్పుకాదనీ, 'చరిత్ర తనను విముక్తి చేస్తుంది'' (ఆరోపణలనుండి) అన్నాడు. కానీ వాస్తవానికి నేడు చరిత్ర కాస్ట్రోకు జేజేలు పలుకుతోంది. అమెరికా మద్దతు గల బాటిష్టా నిరంకుశత్వం నుండి, తన ముఖ్య స్నేహితుడైన చే గువేరాతో కలిసి క్యూబా ప్రజలను విముక్తి చేసినందుకు...సోషలిజం వినా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు మరో ప్రత్యామ్నాయం లేదని నమ్మి క్యూబాలో సోషలిజాన్ని నిర్మించినందుకూ...చిన్న దేశంలోని సోషలిజాన్ని ఎత్తుకు పోడానికి సామ్రాజ్యవాద గద్ద చేసిన ప్రయత్నాలను ప్రజా మద్దతుతో తిప్పి కొట్టినందుకూ...చివరికి అమెరికన్‌ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి దాని 'పెరటి దొడ్డి'లోనే గండి కొట్టినందుకు చరిత్ర కాస్ట్రోను జై కొడుతూనే ఉంటుంది.
90 ఏళ్ల జీవితంలో కాస్ట్రో సాధించిన విజయాలు చిన్నవి కావు. దశాబ్దాల అమెరికా దిగ్బంధాన్ని, సైనిక బెదిరింపులను తట్టుకుని క్యూబాలో సోషలిజాన్ని కాపాడ్డంలో ప్రధాన పాత్ర పోషించాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అలీనోద్యమాన్ని నిలపడంలో కీలక భూమిక నిర్వహించాడు. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానంతరం ప్రపంచ వ్యాపితంగా సోషలిజానికి, కమ్యూనిజానికి వ్యతిరేకంగా వీచిన హోరుగాలిని అధిగమించి 'సోషలిజమో, మరణమో' అన్న ఒకే నినాదం వెనుక క్యూబా ప్రజలను సమీకరించాడు. ఆ విధంగా 'సామ్రాజ్యవాదం అజేయం కాదు' అని మొట్టమొదటగా చిన్న క్యూబాలో నిరూపించాడు. ఒక వైపు పశ్చిమ దేశాల దిగ్బంధాన్నీ, వేధింపులనూ ఎదుర్కొంటూనే మరోవైపు ప్రపంచంలోని ప్రజా ఉద్యమాలకు ధైర్యంగా మద్దతిచ్చాడు. నమీబియా స్వాతంత్య్ర పోరాటానికీ, అనేక ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల విముక్తి ఉద్యమాలకూ కాస్ట్రో నాయకత్వంలో క్యూబా అందించిన సహకారం ఎనలేనిది. వైద్య రంగంలో క్యూబాను ప్రపంచానికే ఆదర్శంగా, కార్పొరేట్‌ వైద్యానికి నిజమైన ప్రత్యామ్నాయంగా నిలిపిన ఘనత కాస్ట్రోదీ, ఆయన సహచరుడు అమరుడైన చే గువేరాదే. మానవాభివృద్ధిలోనూ, క్రీడల్లోనూ, సాంస్కృతిక రంగంలోనూ సోషలిస్టు క్యూబా ఒక మహా శక్తిగా మారడానికి కాస్ట్రో నాయకత్వంలోని క్యూబా కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషి కారణం. సామాన్య కుటుంబం నుండి వచ్చి అసమాన్య లక్ష్యాలు సాధించిన కాస్ట్రో నిరాడంబరుడు. గొప్ప కమ్యూనికేటర్‌. మార్క్సిజం-లెనినిజం పట్ల నిబద్దత గల కమ్యూనిస్టు. ఆయన జీవితం, కృషి సోషలిజం సాధన కోసం పోరాడే ప్రజకు నిత్యం స్ఫూర్తి నిస్తుంది.
ఆ మహత్తర విప్లవ యోధునికివే మా జేజేలు!
కమ్యూనిస్టు వీరునికిదే మా రెడ్‌ సెల్యూట్‌!!

Tuesday, November 22, 2016


| వీళ్ళు హీరోలా? జీరోలా? ||
*నోట్లరద్దుతో తీవ్ర ఆర్థిక అనిశ్చితి.. మోదీ, జైట్లీ ఆర్థికవేత్తలు కాదు
*ఉర్జిత్ జీ....ఆర్థికవేత్తగా నువ్వేం చేశావ్‌?..
*మిగతా దేశాల అనుభవాలు తట్టలేదా?
*500కు ముందే 2వేల నోటా?..
*సాధారణ పరిస్థితులకు 12 నుంచి 15నెలలు
— బ్యాంకు అధికారుల సమాఖ్య
రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత పటేల్‌పై అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థికంగా తీవ్ర అనిశ్చితి నెలకొందని, నోట్ల మార్పిడి కోసం జనం క్యూ లైన్లలో నిలబడి పిట్టల్లా రాలిపోతున్నారని, పని ఒత్తిడి పెరగడంతో గత 12 రోజుల్లో దేశవ్యాప్తంగా 11మంది బ్యాంకు అధికారులు మరణించారని ఈ విపరిణామాలన్నింటికీ ఉర్జిత పటేల్‌దే బాధ్యత అని తీవ్రస్థాయిలో ఆరోపించింది. ఇందుకు నైతిక బాధ్యతగా ఆయన సత్వరమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సమాఖ్య ఉపాఽధ్యక్షుడు డాక్టర్‌ థామస్‌ ఫ్రాంకో ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ ఏమాత్రం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదని విమర్శించారు. ఈ విషయంలో మిగతా దేశాల అనుభవాలను, లేదంటే స్వయంగా తమ గత అనుభవాలను అయినా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. 1978లో అప్పటి ప్రభుత్వం నోట్లరద్దుకు ఉపక్రమించినప్పుడు అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ ఐజీ పటేల్‌ తీవ్రంగా వ్యతిరేకించారనే సంగతిని ఆయన గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీగానీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీగానీ ఆర్థిక వేత్తలు కారన్నారు. అయితే ఓ ఆర్థికవేత్తగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత పటేల్‌.. నోట్లరద్దు రూపంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు విషయంలో రోడ్‌మ్యాప్‌ కరువైందని, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ తీవ్ర గందరగోళ పరిస్థితికి, ఆందోళనలకు గురై సంభవిస్తున్న సామాన్య ప్రజల మరణాలకూ ఇదే కారణమని ఆరోపించారు. (ఆంధ్ర జ్యోతి)
| వీళ్ళు హీరోలా? జీరోలా? ||
*నోట్లరద్దుతో తీవ్ర ఆర్థిక అనిశ్చితి.. మోదీ, జైట్లీ ఆర్థికవేత్తలు కాదు
*ఉర్జిత్ జీ....ఆర్థికవేత్తగా నువ్వేం చేశావ్‌?..
*మిగతా దేశాల అనుభవాలు తట్టలేదా?
*500కు ముందే 2వేల నోటా?..
*సాధారణ పరిస్థితులకు 12 నుంచి 15నెలలు
— బ్యాంకు అధికారుల సమాఖ్య
రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత పటేల్‌పై అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థికంగా తీవ్ర అనిశ్చితి నెలకొందని, నోట్ల మార్పిడి కోసం జనం క్యూ లైన్లలో నిలబడి పిట్టల్లా రాలిపోతున్నారని, పని ఒత్తిడి పెరగడంతో గత 12 రోజుల్లో దేశవ్యాప్తంగా 11మంది బ్యాంకు అధికారులు మరణించారని ఈ విపరిణామాలన్నింటికీ ఉర్జిత పటేల్‌దే బాధ్యత అని తీవ్రస్థాయిలో ఆరోపించింది. ఇందుకు నైతిక బాధ్యతగా ఆయన సత్వరమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సమాఖ్య ఉపాఽధ్యక్షుడు డాక్టర్‌ థామస్‌ ఫ్రాంకో ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ ఏమాత్రం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదని విమర్శించారు. ఈ విషయంలో మిగతా దేశాల అనుభవాలను, లేదంటే స్వయంగా తమ గత అనుభవాలను అయినా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. 1978లో అప్పటి ప్రభుత్వం నోట్లరద్దుకు ఉపక్రమించినప్పుడు అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ ఐజీ పటేల్‌ తీవ్రంగా వ్యతిరేకించారనే సంగతిని ఆయన గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీగానీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీగానీ ఆర్థిక వేత్తలు కారన్నారు. అయితే ఓ ఆర్థికవేత్తగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత పటేల్‌.. నోట్లరద్దు రూపంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు విషయంలో రోడ్‌మ్యాప్‌ కరువైందని, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ తీవ్ర గందరగోళ పరిస్థితికి, ఆందోళనలకు గురై సంభవిస్తున్న సామాన్య ప్రజల మరణాలకూ ఇదే కారణమని ఆరోపించారు. (ఆంధ్ర జ్యోతి)

Monday, November 21, 2016



పెద్దనోట్ల రద్దు నిర్ణయం గ్రామీణ వ్యవస్థను అతలా కుతలం చేసింది. గ్రామీణ బ్యాంకుల సంఖ్య తగ్గడం, సహకార రంగాన్ని ప్రభుత్వం విస్మరించడం, సరిపడా ఎటిఎంలు లేకపోవడం వంటి కారణాలతో గ్రామీణ ప్రజానీకానికి పాతనోట్లు మార్చుకోవడంతోపాటు, వందనోట్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. రబీ సీజన్ ప్రారంభానికి ముందు వెలువడిన నిర్ణయంతో దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట చేతికి వచ్చింది. కూలీలు వున్నారు కాని పంటకోయాలి అంటే కూలీలు చిల్లర ఇస్తేనే వస్తామంటున్నారు. రబీ పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనడానికి వారి వద్ద డబ్బుల్లేవు. బ్యాంకులు కూడా రైతులకు రుణాలు యివ్వడానికి ముందుకురావడంలేదు. ఈ ప్రభావం వ్యవసాయ కూలీల మీద కూడా త్రీవంగా పడుతోంది. మారుమూల గ్రామాల్లో నెలకొనే ఈ పరస్థితులను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైది.

1. దీని వల్ల లాభం తక్కువ ఖర్చు ఎక్కువ 
2. ప్రధాన మంత్రికి సలహాదారులు సరైన విధంగా చెప్పలేదు.
3. కరెన్సీ నోట్లు నల్లధనం కాదు. అన్ని కరెన్సీ నోట్లు తెల్లధనమే.
4. పన్నుకట్టని వ్యక్తికి చేరినప్పుడు నల్లధనంగా మారుతుంది. 
5. పన్నుకట్టే వ్యక్తి దగ్గరికి చేరినప్పుడు అది తెల్లధనంగా మారుతుంది.
6. పద్దతి, వ్యక్తులు నేరస్తులు కాగా నోట్టను ధ్వంసం చేస్తున్నారు.
7. పద్దతి, వ్యక్తులు మారకపోతే, కరెన్సీ, బంగారం, ఆస్తులను నల్ల ధనంగా ఉత్పత్తి చెయ్యడానికి ఉపయోగిస్తారు.
5. పన్నుకట్టే వ్యక్తి దగ్గరికి చేరినప్పుడు అది తెల్లధనంగా మారుతుంది.
6. పద్దతి, వ్యక్తులు నేరస్తులు కాగా నోట్టను ధ్వంసం చేస్తున్నారు.
7. పద్దతి, వ్యక్తులు మారకపోతే, కరెన్సీ, బంగారం, ఆస్తులను నల్ల ధనంగా ఉత్పత్తి చెయ్యడానికి ఉపయోగిస్తారు.
8. ప్రభుత్వం ధనవంతుల దగ్గర కరెన్సీ ఉందని భావిస్తుంది. పేదల దగ్గరే కరెన్సీ ఉంది.
9. 90% గల పేదలది లిక్విడిటీ కరెన్సీయే. ఇప్పుడు వారి దగ్గర కరెన్సీ లేదు.
10. వ్యాపార, వాణిజ్యాలు దెబ్బతింటాయి.
11. కరెన్సీని మార్చే ఖర్చు 10,000 నుండి 15,000 వేల కోట్ల వరకు ఉంటుంది.
12. వచ్చే రెండు మాసాలు బ్యాంకులు కరెన్సీ మార్పిడి, డబ్బును సమకూర్చటం, గుంపులను మేనేజ్‌ చెయ్యటం, ప్రజలు కూడా ఇదే పనిలో ఉంటారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ పై చెడు ప్రభావం ఉంటుంది.
13.లిక్విడిటీ కొరత ఏర్పడి కార్యకలాపాలు స్థంబించుతాయి.
14. ద్రవ్వోల్బణం తగ్గుతుంది. ప్రజల దగ్గర డబ్బు లేకపోవడం వల్ల కొనుగోల్లు తగ్గుతాయి, ధరలు తగ్గుతాయి. ప్రజల కనీసం కూరగాయలు సైతం తినలేని పరిస్థితి ఏర్పడుతుంది.
15. ఆర్థిక కార్యకలాపాలు తగ్గితే ప్రభుత్వం పన్నుల వసూలు తగ్గుతుంది. ప్రజలు కొనుగోల్లు చేస్తేనే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం.
16. '' నోట్ల రద్దు '' చర్య ప్రత్యేకమైనది. దానిని క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి.