Thursday, August 6, 2015


ఆధిపత్యం కోసమే 'అణు' దాడి

Posted On Wed 05 Aug 22:35:32.849057 2015
- హిరోషిమాపై అమెరికా అణు బాంబు దాడికి 70 ఏళ్ళు
           ఆగస్టు ఆరు, తొమ్మిదితో జపానులోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణు బాంబుల దాడి జరిగి డెబ్బై ఏళ్ళు పూర్తవుతాయి. ఇంతవరకు సాధారణంగా మనకు చెబుతూ వస్తున్నది, మనకు తెలిసినది, మన పాఠ్య పుస్తకాలు చెప్పేవి ఏమిటంటే అమెరికా జరిపిన అణు బాంబుల దాడుల వల్లనే జపాను యుద్ధ విరమణ చేసి మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది. ఆ విధంగా రెండవ ప్రపంచయుద్ధం పరిసమాప్తమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్‌ మొదటి బాంబును హిరోషిమాపై వేసిన తర్వాత మాట్లాడుతూ ''అది ఒక అణు బాంబు. దానిని ప్రయోగించడం చరిత్రలో ఒక గొప్ప విషయం'' అని వర్ణించాడు. ఆ తరువాత మాట్లాడుతూ ''హిరోషిమా, నాగసాకి సాధారణ పౌరులపై అణు బాంబులు వేయకుండా ఉండే ప్రత్యామ్నాయాలు ఏవీ అమెరికాకు లేకున్నాయి. వాటిని గనక వేయకుండా ఉండినట్లయితే ఉన్మాద జపనీయులు లొంగిపోయి ఉండేవారు కాదు. జపాన్‌ దీవులను అధీనంలోకి తీసుకునే ప్రయత్నంలో లక్షల కొలది అమెరికా వీర సైనికులు ప్రాణత్యాగం చేయవలసి వచ్చేది'' అని అన్నాడు. కనుక అణు బాంబు దాడులు సరైనవే అని ట్రూమన్‌ ప్రపంచం ముందు సమర్థించుకున్నాడు.
కానీ ఇవి చారిత్రక వాస్తవాలు కావు. అణు బాంబుల దాడికి, రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి ఎటువంటి సంబంధం లేదు! అణు బాంబుల దాడులను అమెరికా ఉద్దేశపూర్వకంగానే చేసింది. దాని వెనుక రాజకీయాలు వేరే ఉన్నాయనే అంశాలు ఇప్పుడు మనం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరముంది. ఆ మేరకు చరిత్ర, ఇతర పాఠ్యపుస్తకాలలో సవరణలు చేసి వాస్తవ చరిత్రను ముందు తరాలకు అందించాల్సిన అవసరముంది. ఇటీవలి కాలం వరకు అత్యంత గోప్యంగా ఉంచబడిన రెండవ ప్రపంచ యుద్ధం నాటి నిర్ణయాలకు సంబంధించిన పలు కీలక దస్తావేజులు నేడు సులభంగా ఇంటర్నెట్‌లో లభ్యమౌతున్నాయి. వీటిలోని చారిత్రక సత్యాల ద్వారా హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల చరిత్రను కొత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.
అణుబాంబును
నేడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మరో నాలుగు అణు బాంబుల దాడులకు అమెరికా అధ్యక్షుని అనుమతితో సైన్యం సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది. మూడవ దాడికి ఆగస్టు 19వ తేదీని ఖరారు కూడా చేసింది. మిగతా దాడులు సెప్టెంబర్‌ మాసంలో చేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఆ అణు బాంబు దాడుల ప్రణాళికను ఉపసంహరించు కోవడంతో జపాన్‌లో అణు బాంబుల ఘోరకలి అంతటితో ఆగింది. కావున ఇప్పుడు లభ్యమౌతున్న హిరోషిమా, నాగసాకి అణు బాంబు ఘటనల సమాచారం ప్రకారం అణు బాంబుల ప్రయోగం అమెరికా హవాయి దీవులలోని పెర్ల్‌ హార్బర్‌పై 1941 డిసెంబర్‌ 7న జరిగిన జపాన్‌ దాడులకు ప్రతీకారంగానో, జపాన్‌ను దారికి తెచ్చి రెండవ ప్రపంచ యుద్ధం ముగించడానికో కాదు. అసలు కారణాలు ప్రబలంగా ముందుకొస్తున్న సోవియట్‌ యూనియన్‌ను తన నూతన అణు బాంబుల శక్తిని నిరూపించి కట్టడి చేయడం, ప్రచ్ఛన్నయుద్ధం వైపు దానిని ఉసిగొల్పడం, రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికాయే ప్రపంచ సైనిక శక్తి అని ప్రపంచానికి చాటి చెప్పడం, తద్వారా ప్రపంచ రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడం, తన రాజకీయ, ఆర్థిక, ఇతరత్రా ఆసక్తులను కాపాడు కోవడమే.
కానీ నేడు సోవియట్‌ యూనియన్‌ లేదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి మొదలైన ప్రచ్ఛన్న యుద్ధమూ అంతరించింది. అయినా ప్రపంచానికి అణు బాంబుల ప్రమాదం పోలేదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాతో మొదలైన అణు బాంబులు తరువాత రష్యా, ఇంగ్లండు, ఫ్రాన్సు, చైనాలకు వ్యాప్తి చెందాయి. ప్రచ్ఛన్న యుద్ధం అంతరిస్తే వీటి సమస్య తీరి పోతుందని భావించిన శాంతికాముక శక్తులకు నిరాశే మిగిలింది. నేడు వినాశనకర అణు బాంబులు మరిన్ని దేశాలకు వ్యాప్తి చెందాయి. అన్ని దేశాలతో కలిపి నేడు మొత్తం 16,000 అణు బాంబులు ఉన్నాయని ఒక అంచనా. వీటిలో సింహభాగం (14,700) కేవలం రెండు దేశాలు-అమెరికా, రష్యాల వద్దనే ఉన్నాయి. వీటి మొత్తం శక్తిసామర్థ్యంతో పూర్తి ప్రపంచాన్ని ఒక్కసారి కాదు పలు మార్లు భస్మీ పటలం చేయవచ్చును. కావున నేడు ప్రపంచంలో ఎక్కువ శాతం శాంతిని కోరుతున్న రాజ్యాలు సైతం నిర్మాణ శక్తి కంటే విధ్వంస శక్తికే పోటీ పడాల్సి వస్తోంది.
(వ్యాసకర్త ఉస్మానియా విశ్వ విద్యాలయం ప్రొఫెసర్‌)
ప్రొఫెసర్‌ 
- ఎమ్‌ చెన్న బసవయ్య

రూపొందించే ప్రక్రియ అమెరికాలో 1942లో అత్యంత గోప్యంగా మొదలైంది. జర్మనీలో నాజీలు అణు బాంబును రూపొందిస్తున్నారని, అది ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమని, దాన్ని వారు రెండవ ప్రపంచ యుద్ధంలో వాడబోతున్నారని, దాని వల్ల మిత్ర రాజ్యాలు ఓటమి పాలయ్యే అవకాశాలు ఉండవచ్చునని చెప్పారు. కావున నాజీ జర్మనీని ఎదుర్కోవాలంటే అమెరికా కూడా అణుబాంబును తయారుచేయాలని బయటి ప్రపంచానికి నమ్మబలికారు. కానీ ప్రముఖ అమెరికా రచయిత మికిజడ్‌ (మిఖాయెల్‌ జేజిమ) ఇటీవల ఒక వ్యాసంలో అసలు నాజీ అణు బాంబు అనేదే ఒక బూటకమని తేల్చేశారు. 1945 ఏప్రిల్‌ 30న హిట్లర్‌ తన మిలిటరీ బంకర్లోనే ఆత్మహత్య చేసుకోవడంతో జర్మనీ ఓటమీ మరింత ప్రస్ఫుటమైంది. దీనితో నాజీ జర్మనీ అణు బాంబు భయం కూడా తేటతెల్లమైంది. అనుకున్న భయం తొలగిపోయిన తర్వాత అణు బాంబు కార్యక్రమం కొనసాగించ వలసిన అవసరం లేకున్నా అమెరికా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోయింది. అమెరికా ఎలాగైనా నూతన బాంబును తయారుచేసి దానిని ప్రయోగించి ప్రపంచానికి, ముఖ్యంగా అప్పటి సోవియట్‌ యూనియన్‌కు తన మేటి సైనిక సత్తాను ప్రదర్శించి ఒక ముందస్తు హెచ్చరిక జారీ చేయాలనుకుంది. జపాన్‌ లొంగుబాటు తథ్యమని తెలిసినా ఆ దేశంపై బాంబు దాడికి ముందుకెళ్ళింది. తొలుత ప్రధాన లక్ష్యం క్యోటో నగరంగా ఉంది. అయితే ఆ నగరంపై పూర్తిగా దట్టమైన మేఘాలు అలముకొని ఉండటంతో రెండవ లక్ష్యమైన హిరోషిమాపై ఆగస్టు 6న అణు బాంబును ప్రయోగించారు. దాంతో ఆగకుండా మూడవ రోజు తరువాత ఆగస్టు 9న మరో బాంబు నాగసాకిపై ఎందుకు ప్రయోగించ వలసి వచ్చింది? కారణం జపాన్‌ను దారికి తీసుకు రావడమో, యుద్ధాన్ని అంతమొందించడమో అనుకుంటే పొరబాటే అవుతుంది. అమెరికా అంతకు ముందే తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు వేరు వేరు రకాల రసాయనాలతో రూపొందించిన అణు బాంబులను వాస్తవ పరిస్థితులలో ప్రయోగించి వాటి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడం, రెండింటి ప్రభావాలను తులనాత్మకంగా అధ్యనం చేయడమే. అందుకు ముగింపుకు చేరుకున్న రెండవ ప్రపంచ యుద్ధ కాలాన్ని ఆసరాగా తీసుకుని, ప్రయోగశాలగా జపాన్‌ భూభాగాన్ని, ప్రయోగ వస్తువులుగా జపాన్‌ ప్రజలను వ్యూహాత్మకంగా వాడుకోవడం అమెరికా ప్రధాన ఉద్దేశం. హిరోషిమా బాంబు యురేనియం-235 ద్వారా ఒక సులభమైన కెమికల్‌ డిజైన్‌తో తయారు చేశారు. దానికి భిన్నంగా నాగసాకిపై వేసిన బాంబును ప్లూటోనియం-239 ద్వారా అత్యంత సంక్లిష్టమైన కెమికల్‌ డిజైనుతో రూపొందించారు. హిరోషిమా బాంబుతో యురేనియం-235 బాంబు పాటవం, ప్రభావం ఏమిటో తెలిసింది. మరింత శక్తివంతమైన ప్లూటోనియం-239 పాటవం, ప్రభావం ఏమిటో తెలియాలి కదా? అందుకని అమెరికా నాగసాకిపై మరో బాంబు ప్రయోగించింది. నిజానికి రెండవ అణు బాంబు ప్రయోగానికి ఎంచుకున్న మొదటి టార్గెట్‌ కొకూర. అక్కడ కూడా క్యోటో వలెనే పొగమంచుతో సాధ్యం కాలేదు. ఈ లోపు విమాన ఇంధనం తగ్గుతుండటంతో సమీపంలోని నాగసాకి నగరంపై జార విడిచారు. నిజానికి ఇది హిరోషిమా బాంబు కంటే ఎక్కువ శక్తివంతమైంది. దీని ప్రభావం ఎక్కువగా ఉరకామి లోయల పర్వతాల వైపు వ్యాపించడంతో హిరోషిమాతో పోలిస్తే కొంత తక్కువ ప్రాణ నష్టం జరిగింది.
Taags :

Vyasam. Prajasakti

ఆధిపత్యం కోసమే 'అణు' దాడి

Posted On Wed 05 Aug 22:35:32.849057 2015
- హిరోషిమాపై అమెరికా అణు బాంబు దాడికి 70 ఏళ్ళు
           ఆగస్టు ఆరు, తొమ్మిదితో జపానులోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణు బాంబుల దాడి జరిగి డెబ్బై ఏళ్ళు పూర్తవుతాయి. ఇంతవరకు సాధారణంగా మనకు చెబుతూ వస్తున్నది, మనకు తెలిసినది, మన పాఠ్య పుస్తకాలు చెప్పేవి ఏమిటంటే అమెరికా జరిపిన అణు బాంబుల దాడుల వల్లనే జపాను యుద్ధ విరమణ చేసి మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది. ఆ విధంగా రెండవ ప్రపంచయుద్ధం పరిసమాప్తమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్‌ మొదటి బాంబును హిరోషిమాపై వేసిన తర్వాత మాట్లాడుతూ ''అది ఒక అణు బాంబు. దానిని ప్రయోగించడం చరిత్రలో ఒక గొప్ప విషయం'' అని వర్ణించాడు. ఆ తరువాత మాట్లాడుతూ ''హిరోషిమా, నాగసాకి సాధారణ పౌరులపై అణు బాంబులు వేయకుండా ఉండే ప్రత్యామ్నాయాలు ఏవీ అమెరికాకు లేకున్నాయి. వాటిని గనక వేయకుండా ఉండినట్లయితే ఉన్మాద జపనీయులు లొంగిపోయి ఉండేవారు కాదు. జపాన్‌ దీవులను అధీనంలోకి తీసుకునే ప్రయత్నంలో లక్షల కొలది అమెరికా వీర సైనికులు ప్రాణత్యాగం చేయవలసి వచ్చేది'' అని అన్నాడు. కనుక అణు బాంబు దాడులు సరైనవే అని ట్రూమన్‌ ప్రపంచం ముందు సమర్థించుకున్నాడు.
కానీ ఇవి చారిత్రక వాస్తవాలు కావు. అణు బాంబుల దాడికి, రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి ఎటువంటి సంబంధం లేదు! అణు బాంబుల దాడులను అమెరికా ఉద్దేశపూర్వకంగానే చేసింది. దాని వెనుక రాజకీయాలు వేరే ఉన్నాయనే అంశాలు ఇప్పుడు మనం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరముంది. ఆ మేరకు చరిత్ర, ఇతర పాఠ్యపుస్తకాలలో సవరణలు చేసి వాస్తవ చరిత్రను ముందు తరాలకు అందించాల్సిన అవసరముంది. ఇటీవలి కాలం వరకు అత్యంత గోప్యంగా ఉంచబడిన రెండవ ప్రపంచ యుద్ధం నాటి నిర్ణయాలకు సంబంధించిన పలు కీలక దస్తావేజులు నేడు సులభంగా ఇంటర్నెట్‌లో లభ్యమౌతున్నాయి. వీటిలోని చారిత్రక సత్యాల ద్వారా హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల చరిత్రను కొత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.
అణుబాంబును రూపొందించే ప్రక్రియ అమెరికాలో 1942లో అత్యంత గోప్యంగా మొదలైంది. జర్మనీలో నాజీలు అణు బాంబును రూపొందిస్తున్నారని, అది ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమని, దాన్ని వారు రెండవ ప్రపంచ యుద్ధంలో వాడబోతున్నారని, దాని వల్ల మిత్ర రాజ్యాలు ఓటమి పాలయ్యే అవకాశాలు ఉండవచ్చునని చెప్పారు. కావున నాజీ జర్మనీని ఎదుర్కోవాలంటే అమెరికా కూడా అణుబాంబును తయారుచేయాలని బయటి ప్రపంచానికి నమ్మబలికారు. కానీ ప్రముఖ అమెరికా రచయిత మికిజడ్‌ (మిఖాయెల్‌ జేజిమ) ఇటీవల ఒక వ్యాసంలో అసలు నాజీ అణు బాంబు అనేదే ఒక బూటకమని తేల్చేశారు. 1945 ఏప్రిల్‌ 30న హిట్లర్‌ తన మిలిటరీ బంకర్లోనే ఆత్మహత్య చేసుకోవడంతో జర్మనీ ఓటమీ మరింత ప్రస్ఫుటమైంది. దీనితో నాజీ జర్మనీ అణు బాంబు భయం కూడా తేటతెల్లమైంది. అనుకున్న భయం తొలగిపోయిన తర్వాత అణు బాంబు కార్యక్రమం కొనసాగించ వలసిన అవసరం లేకున్నా అమెరికా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోయింది. అమెరికా ఎలాగైనా నూతన బాంబును తయారుచేసి దానిని ప్రయోగించి ప్రపంచానికి, ముఖ్యంగా అప్పటి సోవియట్‌ యూనియన్‌కు తన మేటి సైనిక సత్తాను ప్రదర్శించి ఒక ముందస్తు హెచ్చరిక జారీ చేయాలనుకుంది. జపాన్‌ లొంగుబాటు తథ్యమని తెలిసినా ఆ దేశంపై బాంబు దాడికి ముందుకెళ్ళింది. తొలుత ప్రధాన లక్ష్యం క్యోటో నగరంగా ఉంది. అయితే ఆ నగరంపై పూర్తిగా దట్టమైన మేఘాలు అలముకొని ఉండటంతో రెండవ లక్ష్యమైన హిరోషిమాపై ఆగస్టు 6న అణు బాంబును ప్రయోగించారు. దాంతో ఆగకుండా మూడవ రోజు తరువాత ఆగస్టు 9న మరో బాంబు నాగసాకిపై ఎందుకు ప్రయోగించ వలసి వచ్చింది? కారణం జపాన్‌ను దారికి తీసుకు రావడమో, యుద్ధాన్ని అంతమొందించడమో అనుకుంటే పొరబాటే అవుతుంది. అమెరికా అంతకు ముందే తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు వేరు వేరు రకాల రసాయనాలతో రూపొందించిన అణు బాంబులను వాస్తవ పరిస్థితులలో ప్రయోగించి వాటి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడం, రెండింటి ప్రభావాలను తులనాత్మకంగా అధ్యనం చేయడమే. అందుకు ముగింపుకు చేరుకున్న రెండవ ప్రపంచ యుద్ధ కాలాన్ని ఆసరాగా తీసుకుని, ప్రయోగశాలగా జపాన్‌ భూభాగాన్ని, ప్రయోగ వస్తువులుగా జపాన్‌ ప్రజలను వ్యూహాత్మకంగా వాడుకోవడం అమెరికా ప్రధాన ఉద్దేశం. హిరోషిమా బాంబు యురేనియం-235 ద్వారా ఒక సులభమైన కెమికల్‌ డిజైన్‌తో తయారు చేశారు. దానికి భిన్నంగా నాగసాకిపై వేసిన బాంబును ప్లూటోనియం-239 ద్వారా అత్యంత సంక్లిష్టమైన కెమికల్‌ డిజైనుతో రూపొందించారు. హిరోషిమా బాంబుతో యురేనియం-235 బాంబు పాటవం, ప్రభావం ఏమిటో తెలిసింది. మరింత శక్తివంతమైన ప్లూటోనియం-239 పాటవం, ప్రభావం ఏమిటో తెలియాలి కదా? అందుకని అమెరికా నాగసాకిపై మరో బాంబు ప్రయోగించింది. నిజానికి రెండవ అణు బాంబు ప్రయోగానికి ఎంచుకున్న మొదటి టార్గెట్‌ కొకూర. అక్కడ కూడా క్యోటో వలెనే పొగమంచుతో సాధ్యం కాలేదు. ఈ లోపు విమాన ఇంధనం తగ్గుతుండటంతో సమీపంలోని నాగసాకి నగరంపై జార విడిచారు. నిజానికి ఇది హిరోషిమా బాంబు కంటే ఎక్కువ శక్తివంతమైంది. దీని ప్రభావం ఎక్కువగా ఉరకామి లోయల పర్వతాల వైపు వ్యాపించడంతో హిరోషిమాతో పోలిస్తే కొంత తక్కువ ప్రాణ నష్టం జరిగింది.
నేడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మరో నాలుగు అణు బాంబుల దాడులకు అమెరికా అధ్యక్షుని అనుమతితో సైన్యం సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది. మూడవ దాడికి ఆగస్టు 19వ తేదీని ఖరారు కూడా చేసింది. మిగతా దాడులు సెప్టెంబర్‌ మాసంలో చేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఆ అణు బాంబు దాడుల ప్రణాళికను ఉపసంహరించు కోవడంతో జపాన్‌లో అణు బాంబుల ఘోరకలి అంతటితో ఆగింది. కావున ఇప్పుడు లభ్యమౌతున్న హిరోషిమా, నాగసాకి అణు బాంబు ఘటనల సమాచారం ప్రకారం అణు బాంబుల ప్రయోగం అమెరికా హవాయి దీవులలోని పెర్ల్‌ హార్బర్‌పై 1941 డిసెంబర్‌ 7న జరిగిన జపాన్‌ దాడులకు ప్రతీకారంగానో, జపాన్‌ను దారికి తెచ్చి రెండవ ప్రపంచ యుద్ధం ముగించడానికో కాదు. అసలు కారణాలు ప్రబలంగా ముందుకొస్తున్న సోవియట్‌ యూనియన్‌ను తన నూతన అణు బాంబుల శక్తిని నిరూపించి కట్టడి చేయడం, ప్రచ్ఛన్నయుద్ధం వైపు దానిని ఉసిగొల్పడం, రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికాయే ప్రపంచ సైనిక శక్తి అని ప్రపంచానికి చాటి చెప్పడం, తద్వారా ప్రపంచ రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడం, తన రాజకీయ, ఆర్థిక, ఇతరత్రా ఆసక్తులను కాపాడు కోవడమే.
కానీ నేడు సోవియట్‌ యూనియన్‌ లేదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి మొదలైన ప్రచ్ఛన్న యుద్ధమూ అంతరించింది. అయినా ప్రపంచానికి అణు బాంబుల ప్రమాదం పోలేదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాతో మొదలైన అణు బాంబులు తరువాత రష్యా, ఇంగ్లండు, ఫ్రాన్సు, చైనాలకు వ్యాప్తి చెందాయి. ప్రచ్ఛన్న యుద్ధం అంతరిస్తే వీటి సమస్య తీరి పోతుందని భావించిన శాంతికాముక శక్తులకు నిరాశే మిగిలింది. నేడు వినాశనకర అణు బాంబులు మరిన్ని దేశాలకు వ్యాప్తి చెందాయి. అన్ని దేశాలతో కలిపి నేడు మొత్తం 16,000 అణు బాంబులు ఉన్నాయని ఒక అంచనా. వీటిలో సింహభాగం (14,700) కేవలం రెండు దేశాలు-అమెరికా, రష్యాల వద్దనే ఉన్నాయి. వీటి మొత్తం శక్తిసామర్థ్యంతో పూర్తి ప్రపంచాన్ని ఒక్కసారి కాదు పలు మార్లు భస్మీ పటలం చేయవచ్చును. కావున నేడు ప్రపంచంలో ఎక్కువ శాతం శాంతిని కోరుతున్న రాజ్యాలు సైతం నిర్మాణ శక్తి కంటే విధ్వంస శక్తికే పోటీ పడాల్సి వస్తోంది.
(వ్యాసకర్త ఉస్మానియా విశ్వ విద్యాలయం ప్రొఫెసర్‌)
ప్రొఫెసర్‌ 
- ఎమ్‌ చెన్న బసవయ్య
Taags :

Sampadakeeyam. Prajasakti

నిలువెత్తు నిర్లక్ష్యం

Posted On Wed 05 Aug 22:37:24.258812 2015
        మధ్యప్రదేశ్‌లో వరుసగా జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాలు దిగ్భ్రాంతినీ, రైల్వే శాఖ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ప్రయాణీకులతో కిటకిటలాడుతున్న రెండు రైళ్లు నిమిషాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో పట్టాలు తప్పడం, 37 మంది దాకా మృతి చెందడం దారుణం. మరో 25 మంది దాకా తీవ్ర గాయాల పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. స్థానికులు సకాలంలో స్పందించడంతో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. లేని పక్షంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. వాస్తవానికి రైలు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా ఎప్పుడో మారిపోయాయి. భద్రతకు ఏమాత్రం పూచీ లేని పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఆప్తులను, సన్నిహితులను రైలు ఎక్కించిన తరువాత వారు క్షేమంగా గమ్యం చేరారన్న సమాచారం అందేంత వరకూ ప్రాణాలు అరచేత పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం జరిగిన తరువాత హడావిడిగా కమిటీని వేయడం, ఆ తరువాత నివేదికను బుట్టదాఖలు చేయడం షరా మాములుగా మారింది. పార్లమెంటరీ కమిటీలు చేసిన సిఫార్సులూ బుట్టదాఖలయ్యాయి. రైల్వే లైన్ల మరమ్మతుల నుంచి సిబ్బంది సంఖ్యను పెంచే అంశం వరకూ వివిధ అంశాలపై వివిధ కమిటీలు, రైల్వే ట్రేడ్‌ యూనియన్లు, ప్రజాసంఘాలు ఇచ్చిన సిఫార్సులు ప్రభుత్వం ముందు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. అయితే, వీటిని పట్టించుకునే తీరిక పాలకులకు ఏ కోశానా లేకపోవడం విచారకరం. తాజా సంఘటన అనంతరం కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనకు ముందే భారీ వర్షాలతో పొంగుతున్న మాచక్‌ నది నీళ్లు పట్టాలపై భారీ ఎత్తున నిలవడమే ప్రమాదానికి కారణమని రైల్వేశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనూహ్యంగా వచ్చిన వరదలను అంచనా వేయలేకపోయామన్నది వారి వివరణ. వర్షాకాలంలో వానలు పడటం, వరదలు రావడం కొత్తేమీ కాదు. అతి తక్కువ రోజుల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడమూ, ఫలితంగా అనూహ్య వరదలు సంభవించడమూ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నదే!
ఆ విషయం పక్కన పెట్టినప్పటికీ లైన్లను నిరంతరం కాపలా కాస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యల కోసం హెచ్చరికలు చేసే గ్యాంగ్‌మెన్ల వ్యవస్థ రైల్వేశాఖకు ప్రత్యేకం. కీలకమైన ఈ వ్యవస్థలో నియమకాలు కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి. ఉన్న వారిని కూడా ఏదో రకంగా వదిలించుకోవడానికే రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. సమాచార సాంకేతిక విప్లవానికి ఆకాశమే హద్దుగా మారిన ప్రస్తుత రోజుల్లోనూ తాతల కాలం నాటి బూజు పట్టిన విధానాలనే రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఫలితంగా రైలు పట్టాల వెంట నిరంతరం పహరా కాయాల్సిన గ్యాంగ్‌మెన్లపై పని భారం విపరీతంగా పెరుగుతోంది. ఒక్క గ్యాంగ్‌మెన్ల విషయంలోనే కాదు, ప్రయాణీకుల భద్రతతో ముడిబడిన డ్రైవర్లు, గార్డులు, సిగలింగ్‌ సిబ్బంది, తదితర ఉద్యోగాల భర్తీ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానిది ఇదే వైఖరి. 2013లో పార్లమెంటుకు అప్పటి రైల్వే శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారమే ప్రయాణీకుల భద్రతకు సంబంధించిన వివిధ విభాగాల్లో 1,42,311 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తరువాత కూడా ఉద్యోగ విరమణలే తప్ప, కొత్త నియామకాలు లేవు. దీంతో ఈ విభాగాల్లోని అత్యధిక సిబ్బంది రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఫలితంగా రైల్వేశాఖలో ప్రమాదాలు నియంత్రించడం కష్టమైపోతోంది. ప్రయాణీకుల భద్రతపై ఏ మాత్రం ఆలోచించే ప్రభుత్వమైనా మొట్టమొదట ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయమై విమర్శల వర్షం కురిపించిన బిజెపి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వానికన్నా అధికంగా ప్రైవేటీకరణ రాగాన్ని ఆలపిస్తున్నారు. ఉట్టికెగిరే సత్తా లేకపోయినా ఆకాశానికెగిరేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మోడీ ప్రభుత్వం ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో అట్టహాసంగా ఆవిష్కరించిన బుల్లెట్‌ ట్రైన్‌ విన్యాసమూ ఆ కోవలోనిదే. దేశవ్యాప్తంగా అత్యధిక రైలు ప్రమాదాలు పట్టాలు తప్పడం కారణంగానే జరుగుతున్నాయి. నిర్వహణ, నాణ్యత లోపాలే దీనికి కారణమని వివిధ కమిటీల నివేదికలు ఇప్పటికే నిగ్గు తేల్చాయి. గడిచిన దశాబ్ద కాలంలో సగటున ఏడాదికి 150కి పైగా ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండవ స్థానంలో లెవెల్‌క్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాలు నిలిచాయి. వీటిలో అత్యధిక భాగం ప్రమాదాలకు సిబ్బందినే కారణంగా చూపుతున్న రైల్వేశాఖ వారికి అవసరమైన ఆధునిక సదుపాయాలను, తగిన సంఖ్యలో మానవ వనరులను కల్పించడంపై మాత్రం దృష్టి సారించడంలేదు.
ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అత్యాధునిక ప్రమాద హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైల్వేమంత్రి ఊరించినప్పటికీ ఆ దిశలో ఇప్పటి వరకు అడుగులు పడలేదు. ఆధునిక ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామని, వెల్డింగ్‌లో నూతన విధానాలను అనుసరించి రైళ్లు పట్టాలు తప్పడాన్ని నిరోధిస్తామని చెప్పిన మాటలకూ ఇంతవరకు అతీగతీ లేకపోవడం విచారకరం. రైల్వే మంత్రిత్వ శాఖే నియమించిన డాక్టర్‌ అనిల్‌ కకోడ్కర్‌ నేతృత్వంలోని హైలెవల్‌ కమిటీ ఐదు సంవత్సరాల కాలంలో భద్రతా ప్రమాణాల పెంపు కోసం లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని రెండు సంవత్సరాల క్రితం సూచించింది. ఇప్పటి వరకు ఆ దిశలో కేటాయింపులు నామమాత్రమే! భద్రతకు సంబంధించిన మౌలిక వనరుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని, అడ్వాన్స్‌డ్‌ సిగలింగ్‌ వ్యవస్థ కోసం మరో రూ.20 వేల కోట్లు కేటాయించాలన్న ఆ కమిటీ సిఫార్సులు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన సిఫార్సులను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశలో చేసిన సూచనల అమలుకు మాత్రం తహతహలాడుతోంది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న మంత్రులనే భుజాలకెత్తుకుంటున్న సమయంలో ప్రమాద సంఘటనలకు బాధ్యత వహించే నైతికతను మోడీ ప్రభుత్వం నుంచి ఏ మాత్రం ఆశించలేం. వట్టిమాటలను కట్టిపెట్టి ప్రయాణీకుల ప్రాణాలను కాపాడే చర్యలు చేపడితే అదే పదివేలు!
Taags :

Tuesday, August 4, 2015

Vyasam sakshi


Vyasam. Prajasakti

ఆర్థిక విధానంపై ప్రతిష్టంభన

Posted On Tue 04 Aug 00:32:24.057552 2015
           ఆర్థిక విధానానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య విభేదాలున్నాయని వార్తా పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. గవర్నర్‌ అధికారాలను కుదించటానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంకు చట్టాన్ని సవరించాలని ప్రభు త్వం ఆలోచిస్తున్నంత తీవ్రంగా ఈ అభిప్రాయభేదాలున్నాయి. అయితే ఈ తేడాలు భారత ఆర్థిక వ్యవస్థలో లోతుగా పాతుకుపో యిన అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలే. ఇక్కడ ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అనేది కాదు. అసలు విషయం ఏమంటే ఏ విధానాన్ని అవలంబించినా ఆర్థిక వ్యవస్థ మరింత ఒడిదుడుకులకు లోనుకావటం తథ్యమనేది. ఒక సంక్షోభ రూపాన్ని అధిగమించే ప్రయత్నం చేసినప్పుడు అది విజయవంతంగా మరో రూపాన్ని సంతరించుకుంటున్న పరిస్థితిని సంక్షోభంగా నిర్వచించినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నదని ఎవరైనా చెప్పవచ్చు. అయితే ఈ సంక్షోభం ఎలా వ్యక్తీకరింపబడాలి అనే విషయం గురించే ప్రభుత్వానికి, రిజర్వ్‌బ్యాంకుకు మధ్య అభిప్రాయబేధాలున్నాయి.
పడిపోతున్న వృద్ధి రేటు
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు స్పష్టంగా మందగిస్తున్నది. ఇక్కడ తగ్గుతున్న ఎగుమతులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే 2015లోని మొదటి త్రైమాసికంలో ఎగుమతులను డాలర్లలో లెక్కించినప్పుడు 16.8 శాతం క్షీణించాయి? ఎగుమతులలో వచ్చిన ఈ క్షీణత వల్ల ఏర్పడిన గుణక ప్రభావం ఫలితంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తగ్గిపోయింది. దిగుమతులు కూడా డాలరు విలువలో గత సంవత్సరంతో పోల్చినప్పుడు మొదటి త్రైమాసికంలో 12.6 శాతం క్షీణించాయనేది నిజం(ఇది రూపాయలలో లెక్కించినప్పుడు 7.2 శాతంగా ఉన్నది). కానీ ఈ క్షీణత ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోవటం వల్ల జరిగింది. చమురు దిగుమతితో సంబంధంలేని ఇతర దిగుమతులను లెక్కలోకి తీసుకున్నప్పుడు అంతకుముందు సంవత్సరం కంటే 2015-16 మొదటి త్రైమాసికంలో 2.6 శాతం పెరిగాయి. అయితే చమురు ధరలు పడిపోయినప్పటికీ మొదటి త్రైమాసికంలో 3,220 కోట్ల డాలర్ల వ్యాపార లోటు ఉన్నది. (ఇది గత సంవత్సర లోటు 3,300 కోట్ల డాలర్లకు దాదాపు సమానం). 2015 జులై 10 నాటికి భారత విదేశీ ద్రవ్య నిల్వల మొత్తం 33,400 కోట్ల డాలర్లు. దీనితో ఇలాంటి వ్యాపార లోటుతో ఏర్పడే కరెంటు ఖాతా లోటును అందుబాటులోవున్న విదేశీ మారకపు నిల్వలతో మేనేజ్‌ చెయ్యవచ్చనే భావన ఏర్పడుతుంది. అయితే ఈ విదేశీ మారకపు నిల్వలలో చాలా వరకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్‌ఐఐలు) ద్వారా వచ్చినవి.
ఈ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను రాత్రికి రాత్రే ఉపసంహరించుకోవచ్చు. చెల్లింపుల సమతూకం అవసరాలకు అలా ఉపసంహరించుకోవటాన్ని నిరోధించవలసిన అవసరం ఉంటుంది. నిజానికి అలాంటి నిధులు సరిపడా ప్రవహిచేలా చూసుకోవటం అవసరం. అలా జరగాలంటే వడ్డీ రేటును పెంచివుంచటం ఒక మార్గం. వడ్డీ రేటును తగ్గిస్తే నిధులు బయటకు వెళ్ళటం మొదలవుతుంది. అలా నామమాత్రంగానే మొదలైనప్పటికీ ఆ తరువాత మారకపు రేటు పడిపోతుంది. దానితో అది మరింతగా పడిపోతుందని భావించి నిధులు బయటకు వెళ్ళటం ఒక ప్రవాహంగా మారుతుంది. అలాంటి పరిస్థితిలో నిల్వలు ఏ స్థాయిలో ఉన్నా అవి అచిరకాలంలో కరిగిపోయి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. రూపాయి మారకపు విలువ పడిపోవటంతో దిగుమతుల ధరలు పెరుగుతాయి. దానితో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా వడ్డీ రేటును పెంచివుంచవలసి ఉంటుంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పెంచాలంటే వడ్డీ రేటును తగ్గించాలి. వడ్డీ రేటును తగ్గిస్తే వాస్తవంలో వృద్ధి ఉత్తేజితమౌతుందా లేదా అనేది వేరే విషయం. అయితే ఇందుకోసం వడ్డీ రేటు దిశ తిరోగమనం వైపు ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆవిధంగా మనకు ఎగుమతులు పడిపోవటానికి కారణమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం కొనసాగుతున్న స్థితిలో చెల్లింపుల సమతూకం సాధించేందుకు వడ్డీ రేటును ఎక్కువగా ఉండేలా చూడవలసిన ఆవశ్యకత ఉన్నది. అదే సమయంలో వృద్ధిని సాధించాలంటే వడ్డీ రేటు తక్కువగా ఉండేలా చూడవలసిన అవసరం కూడా ఉన్నది. ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థను రెండు వేరువేరు విధాలుగా ప్రభావితం చేస్తున్నది. ఒకదానితో వడ్డీ రేటును పెంచవలసిన ఆవశ్యకత, మరో దానితో వడ్డీ రేటును తగ్గించవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వడ్డీ రేటును తగ్గించాలంటుంటే, రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వడ్డీ రేటును పెంచాలని కోరుతున్నారు.
వడ్డీ రేటును పెంచి ఉంచినప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచటానికి మరో సాధనాన్ని ఉపయోగిస్తే ఈ తగవు సమసిపోతుంది. అయితే చిక్కంతా ఇక్కడే ఉన్నది. నయా ఉదారవాదం ఒక పద్ధతి ప్రకారం ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు ఉపయోగపడే మరింత సమర్థత గల మరో సాధనాన్ని ఉపయోగించకుండా చేసింది. దానిపేరే విత్త విధానం. ఆర్థిక లోటును ద్రవ్య పెట్టుబడి ఇష్టపడదు.
అందుకే నయా ఉదారవాద విధానాలను అవలంబించే దేశాలు 'విత్త బాధ్యత' చట్టాలను చేసి స్థూల జాతీయోత్పత్తిలో లోటు మొత్తం ఎంత ఉండాలనే పరిమితిని (ఇది సాధారణంగా 3 శాతంగా ఉంటుంది) విధిస్తాయి. అదే సమయంలో విత్త బాధ్యత చట్టం విధించిన పరిధిలో ఆర్థిక వ్యవస్థను విత్తపరంగా ఉత్తేజితం చేసేందుకు సాధ్యపడే విధంగా పన్నులతో వచ్చే ఆదాయాన్ని విస్తృతపరచటం, ప్రభుత్వ వ్యయాన్ని పెంచటం వంటి చర్యలను చేపట్టటం జరగదు. సంపన్నులపై పన్నులను విధించి ఆ రెండింటినీ విస్తరిస్తే ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయవచ్చు. కానీ ధనికులపై పన్నులు విధించటాన్ని ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. దానితో విత్త విధానంతో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రత్యామ్నాయం నయా ఉదారవాదంలో తిరస్కరింపబడుతుంది.
ఉదాహరణకు ఆర్థిక వ్యవస్థ విస్తృతికి అనుగుణంగా వడ్డీ రేటు విధానం ఉండాలని రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌తో తగవుపడే ఇదే అరుణ్‌ జైట్లీ ద్రవ్య లోటును తగ్గించటంలో తలమునకలై ఉన్నారు. ఆర్థిక వ్యవస్థను మందగింపజేసే అవకాశం ఉన్నప్ప టికీ ఉపాధి హామీ వంటి పథకాలకు కేటాయించే నిధులను తగ్గిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగించే మరో విధాన సాధనం పేరు మారకపు రేటు విధా నం(ఇది దేశ నికర ఎగుమతులను పెంచుతుంది).
రెండు స్పష్టమైన కారణాలచేత దీనిని కూడా తిరస్కరించటం జరుగుతోంది. చమురు దిగుమతులపై ఆధారపడే మనలాంటి ఆర్థిక వ్యవస్థలో రూపాయి మారకపు విలువ రేటు తగ్గటంవల్ల దిగుమతి చేసుకుంటున్న ముడి సరుకుల ధర పెరిగితే దాని ప్రభావంతో అంతిమంగా మార్కెట్‌లోకి ప్రవేశించే సరుకుల ధర పెరుగుతుంది. రెండవ కారణమేమంటే ఒక్కసారి మారకపు రేటు తగ్గటం అంటూ జరిగితే అది మరింతగా తగ్గుతుందనే భావన ఏర్పడి పెట్టుబడులు దేశం విడిచి వెళతాయి. మారకపు విలువలో వాస్తవ కుదింపు కరెన్సీ పతనానికి సూచికగా ఉండే అవకాశం ఉంటుంది.
తీవ్రతరమయ్యే ఘర్షణ
కాబట్టి ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్‌ బ్యాంకుల మధ్య జరుగుతున్న ఘర్షణ మూలాలు నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో ఏక కాలంలో అనేక లక్ష్యాలను సాధించటానికి అందుబాటులో ఉన్న ఏకైక సాధనంగా వడ్డీ రేటు విధానం ఉన్నదనే వాస్తవంలో ఉన్నాయి. స్థూల జాతీయోత్పత్తి, చెల్లింపుల సమతౌల్య నిర్వహణ, ద్రవ్యోల్బణ నియంత్రణ మొదలగునవి ఈ లక్ష్యాలలో ప్రధానమైనవి. ప్రస్తుతం కేవలం ఒకే ఒక సాధనంతో బహుళ లక్ష్యాలను సాధించగలగటం తార్కికంగా దుస్సాధ్యం. ఈ లక్ష్యాలను సాధించే అవకాశం ఏమైనా ఉండాలంటే అవి ఎంత సంఖ్యలో ఉన్నాయో కనీసం అదే సంఖ్యలో విధాన సంబంధిత సాధనాలుండాలి. వేరేవిధంగా చెప్పాలంటే 'ఒకే రాయితో అనేక పక్షులను కొట్టటం' అనేది అదృష్టం మీదనే ఆధారపడివుంటుంది. సాధారణీకరించాలంటే పక్షులెన్ని ఉన్నాయో కనీసం అదే సంఖ్యలో రాళ్ళు ఉంటేనే వాటిని కొట్టగలుగుతాం. ఒక దేశం అనేక లక్ష్యాలను సాధించటానికి దానికి కేవలం ఒకే ఒక సాధనాన్ని నయా ఉదారవాదం అందుబాటులో ఉంచటంవల్ల ఆ సాధనాన్ని ఎలా వాడాలనే విషయం గురించి ఘర్షణ జరగటం అనివార్యం. కొందరు ఈ సాధనాన్ని ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సాధించటానికి వాడాలనుకుంటే ఇతరులు మరొక లక్ష్యాన్ని సాధించటానికి వాడాలనుకుంటారు. భారత్‌లో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఇప్పటివరకూ జరిగిన దానికంటే మరింతగా ఎన్‌డిఎ ఆర్థిక మంత్రి నయా ఉదారవాద నిర్దేశాలను పాటిస్తున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచటానికి ద్రవ్య విధానాన్ని తప్ప మరే ఇతర సాధనాన్ని వాడటానికి ఆయన సుముఖంగా లేరు. ఆయన ప్రభుత్వ ప్రతిష్టంతా అలా ఉత్తేజింపజేయటంపైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే 'వృద్ధి' జరుగుతుందని, దానితో మంచిరోజులు(అచ్చేదిన్‌) వస్తాయనే నినాదంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గనుక. మరోవైపు విదేశీ మారకాన్ని నిర్వహించే, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే సంస్థగా ఉన్న రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేటు తగ్గితే చెల్లింపుల సమతౌల్యం, ధరల స్థితి అస్థిరమౌతుందనే స్థిర అభిప్రాయంతో ఉన్నది. ఆ విధంగా నయా ఉదారవాద నిర్దేశాలను ఆచరిస్తూ ప్రభుత్వం తన చేతులను తానే కట్టేసుకోవటాన్ని ఈ రెండింటి మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన ప్రతిబింబిస్తున్నది. అనేక లక్ష్యాలను సాధించటానికి దానికి అందుబాటులో ఉన్నది ఒకే ఒక సాధనం. నిజానికి వడ్డీ రేటు సాధనం వృద్ధి సాధించటానికి అంత ప్రభావశీలమైనది కాదు. ఒకవేళ అది ప్రభావశీలమైనదేనని అనుకున్నా దానితో చేసే ప్రయత్నం ఒక తార్కిక దుస్సాధ్యత అని చెప్పకతప్పదు.అంతేకాకుండా ఈ ఘర్షణ రాబోయే రోజుల్లో మరింతగా ముదురుతుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. ఉదాహరణకు ఈ ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సాధారణ సూచిక వృద్ధి గత సంవత్సరం ఇదే కాలంలో 4.7 శాతంగా ఉన్న వృద్ధితో పోల్చినప్పుడు అది 3.0 శాతంగా ఉన్నది. యూరో జోన్‌ దేశాలు 'పొదుపు' విధానాన్ని మరింత తీవ్రంగా ఆచరిస్తున్న స్థితిలో చైనా వృద్ధి రేటు మందగించింది.
ఈ మధ్య కాలంలో చైనాలో సంభవించిన స్టాక్‌ మార్కెట్‌ పతనం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది. దీని ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగిస్తుంది. ఇలా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించటం ఎన్‌డిఎ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. దానితోపాటు తమకు ఓటువేసిన పట్టణ యువతలో ఉద్యోగిత కొరవడుతుంది. తత్ఫలితంగా వడ్డీ రేటు తగ్గించాలని ప్రభుత్వం ఒత్తిడితెస్తుంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించటం, దానితో గణనీయంగా ఎగుమతులు తగ్గిపోవటం వల్ల విదేశీ పెట్టుబడుల ప్రవాహం దేశంలోకి రావటంపై చెల్లింపుల సమతౌల్యం మరింతగా ఆధారపడుతుంది. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేటు ఎక్కువగా ఉండాలంటుంది. కాబట్టి రెండింటి మధ్య స్పర్థ మరింతగా పెరుగుతుంది. అయితే వడ్డీ రేటును పెంచినా లేదా తగ్గించినా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండటం అనే వాస్తవ జీవిత వైరుధ్యాన్ని ఈ స్పర్థ ప్రతిబింబిస్తుంది.
- ప్రభాత్‌ పట్నాయక్‌
Taags :

Sampadakeeyam ptrajasakti

రెండు పార్టీలు నాలుగు నాలుకలు

Posted On Tue 04 Aug 00:32:51.387296 2015
          వ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై బిజెపి, టిడిపిలు చేస్తున్న విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. అధికారంలోకొచ్చి సంవత్సరం దాటినా హోదాపై స్పష్టం చేయకుండా ప్రజలను డోలాయమానంలో పడేసేందుకు రెండు పార్టీలు నాలుగు నాల్కలతో మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా సహా పునర్విభజన చట్టంలో పొందుపర్చిన, ఆ సందర్భంగా పార్లమెంటు చర్చలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని బిజెపి, టిడిపి సంయుక్తంగా ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కాయి. వాగ్దానాల అమలులో రెండు పార్టీలూ కప్పదాట్లకు దిగడం జనానికి వెన్నుపోటు పొడవడమే. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కానీ, కనీస పరిశీలన కానీ కేంద్రం చేయట్లేదని మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ లోక్‌సభలో శుక్రవారం చేసిన ప్రకటనతో టిడిపి, బిజెపిలది డ్రామాలేనని మరోసారి స్పష్టమైంది. హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్‌ ఢిల్లీలో ధర్నా చేస్తానని పేర్కొన్న తరుణంలో మంత్రి ఇందర్‌జిత్‌ వ్యాఖ్యలు అటు బిజెపిని, ఇటు టిడిపిని సంకటంలో పడేశాయి. జగన్‌ ధర్నాకు తతిమ్మా ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతుండటంతో అధికార పార్టీలకు గంగవెర్రులెత్తుతోంది. ఒకవైపు నష్ట నివారణకు ఆగమేఘాల మీద తెలుగుదేశం, బిజెపి నేతలు రంగంలోకి దిగి ప్రజలను మభ్య పుచ్చేందుకు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు వారి పార్టీ ఎంపీలు, మంత్రులు నాయకుల ప్రకటనల్లోని గాలి తీసేస్తున్నాయి. ఎపికి ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుతో సహా తామందరికీ తెలుసని జెసి దివాకర్‌ రెడ్డి, ఎంపిగా గెలిచి ఎందుకు ఢిల్లీకి వెళ్లానా అని బాధ పడుతున్నానని రాయపాటి లోగుట్టును బయటపెట్టారు. తాము ప్యాకేజీ ఇస్తామన్నామని నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. చంద్రబాబు, యనమల వంటి వారు ప్రత్యేక హోదా కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటామని చెబుతూ దాన్నో నిరంతర వార్తా స్రవంతిలా మార్చేశారు మినహా హోదా సాధిస్తామని కచ్చితంగా చెప్పకపోవడం కొసమెరుపు. మోడీ సర్కారు ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తెచ్చినప్పుడే ఎపికి ప్రత్యేక హోదాపై ఆశలు సన్నగిల్లాయి. నీతి ఆయోగ్‌ వచ్చినా హోదాకు ఢోకా లేదని నమ్మబలుకుతూ వచ్చారు టిడిపి, బిజెపి నాయకులు. కేంద్ర మంత్రి వెంకయ్య ఎప్పుడైతే హోదాపై నాలుక మడత పెట్టడం మొదలు పెట్టారో దింపుడు కళ్ళం ఆశా పోయింది. హోదా ఇచ్చేది లేదంటే జనం ఎక్కడ ఛీ కొడతారోనని రెండు పార్టీల నేతలూ ప్రజలను భ్రమలను మభ్యపెడుతున్నారంతే. పైగా ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పునర్విభజన చట్టంలో పొందుపర్చకుండా తప్పు చేసిందని వెంకయ్య తూలనాడుతున్నారు. కాంగ్రెస్‌ది తప్పే అనుకుంటే ఆనాడు పార్లమెంటులో ఎందుకు నిలదీయలేదు? రాజ్యసభలో బిజెపి మద్దతు లేకుండా బిల్లు పాస్‌ కాదు. బిల్లులో పెట్టాలని బిజెపి పట్టుబడితే కాంగ్రెస్‌ ఆ పని చేసేది కాదా? రాజ్యసభలో మన్మోహన్‌సింగ్‌ చేత తామే పట్టుబట్టి ఆరు సూత్రాల ప్రకటన చేయించామని బిజెపి, టిడిపి ఎన్నికల్లో ప్రచారం చేశాయి. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్స్‌ ద్వారా ఎపిలో కలిపిన బిజెపి సర్కారు, ప్రత్యేక హోదాపై కూడా అలాగే చట్టానికి సవరణ చేస్తానంటే ఎవరన్నా వద్దన్నారా? చిత్తశుద్ధి లోపించింది బిజెపికి కాదా? రాష్ట్రాభివృద్ధిపై నిత్యం గొంతు చించుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా బిజెపిని ఎందుకు వెనకేసుకొస్తున్నట్లు?
14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దందని బిజెపి, టిడిపి తప్పించుకోవడం పొసగని వ్యవహారం. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం ఆమోదించొచ్చు లేదా మార్పులు చేయొచ్చు. మక్కీకిమక్కీ సూచనలన్నింటినీ ఆమోదించేసి నెపం ఆర్థిక సంఘంపై నెట్టడం వంచనే కదా! ఆర్థిక సంఘాన్ని కాంగ్రెస్‌ వేసిందని, ఛైర్మన్‌ వైఎస్‌ కుటుంబానికి బంధువని టిడిపి చేసే ఆరోపణలు ఎంత మాత్రం చెల్లవు. కేంద్రం వద్ద తనకు పలుకుబడి ఉందని గప్పాలుకొట్టే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? నీతి ఆయోగ్‌తో నిధులను కేంద్రీ కరిస్తున్నారు. వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందని తేలి పోయింది. ఐదేళ్లపాటు పరిహారం ఇస్తామంటున్నా నమ్మడం కష్టం. ఐదేళ్లలో రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.50 వేల కోట్లు దాటుతుందని అంచనా వేయగా ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం ఇచ్చేది చాలా తక్కువ. తొలి ఏడాది లోటు భర్తీకి కాంగ్రెస్‌ రూ.5 వేల కోట్లు ప్రతిపాదిస్తే వెంకయ్య రూ.10 వేల కోట్లు ఇవ్వాలన్నారు. ప్రత్యేక హోదా అయిదు కాదు పదేళ్లు కావాలన్నారు. ప్రతిపక్షంలో ఉండగా చేసిన బాసలు అధికారంలోకొచ్చాక ఇప్పుడేమయ్యాయో ఆయనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టుకు ఏడాదికి పదో పరకో కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతుందో టిడిపి, బిజెపి చెప్పగలుగుతాయా? ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై బిజెపి, టిడిపి నాటకాలు ఆడుతున్నాయని ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. ఆ రెండు పార్టీల మెడలు వంచైనా హామీలు అమలు చేయించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది.
Taags :

Dharna.mro office in manubolu-4-8-2015/11-00am