Saturday, August 1, 2015

Cpm.office.gudur-ijr meeting hall opening-29-7-2015








Cpm-sadasu. Manubolu






Vyasam.prajasakti

మహిళా ప్రాతినిధ్యం

Posted On Sat 01 Aug 00:02:14.270681 2015
          'అతివలు ఆకాశంలో సగం. అవనిపై సగం' అన్న మాటలు వింటే చాలు మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. కాని అభివృద్ధిలో వారి వెనుకబాటునూ, కట్టుబాట్లమధ్య నలిగిపోతున్న వారి పరిస్థితినీ చూస్తే మనసు దుఖంతో చలించిపోతుంది. బీహార్‌ మహిళలు సరిగ్గా ఈ స్థితిలోనే ఉన్నారు. జనాభా రీత్యా దేశంలోకెల్లా మూడవ అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను మించిపోయింది. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల గణాంకాలు ప్రపంచానికి చాటిచెప్పిన వాస్తవమిది. వారు వెలువరించిన తీర్పుపై ఆయా కుటుంబాల్లోని పురుషుల ప్రభావం ఉన్నప్పటికీ పితృస్వామిక భావజాలం వేళ్లూనుకుపోయిన ఆ రాష్ట్రంలో తండ్రి చాటు బిడ్డలు, భర్త చాటు భార్యలు బయటకు వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం సాధారణ విషయం కాదు. మార్పు కోసం తమను తాము మార్చుకునేందుకు సైతం సిద్ధమైన మహిళల మనోగతానికి నిలువెత్తు నిదర్శనం.2005 ఫిబ్రవరిలో జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పరచేందుకుగాను ఏ ఒక్క పార్టీ పూర్తి ఆధిక్యత సాధించలేకపోయింది. దాంతో బీహార్‌ వాసులకు రాష్ట్రపతి పాలన ప్రాప్తించింది. ఎనిమిది నెలల అనంతరం తిరిగి అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడడంలో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా నిలిచిందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అనంతరం 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు (54 శాతం) పురుష ఓటర్లను (51 శాతం) మించి పాల్గొన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో సైతం బీహారీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆర్థిక కార్యకలాపాలలోకే కాకుండా ఎన్నికల రంగంలోకి కూడా మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారనడానికి వెనుకబడిన బీహార్‌ ఒక ఉదాహరణ. ఈ మార్పులు మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి తోడ్పడుతుందన్నది వాస్తవమే అయినా రావలసినంత మార్పు రావడం లేదన్న చేదు నిజాన్ని కూడా ఒప్పుకోక తప్పదు. విచిత్రమేమంటే అక్షరాస్యత లేని మహిళలు ఒకరకమైన ఆధిపత్య ధోరణులను ఎదుర్కొంటూ ఉంటే విద్య నేర్చుకుని ఉద్యోగాల్లో చేరే మహిళలు మరో రకమైన ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్నారు. నిజానికి విద్య, ఉద్యోగం వారి పని భారాన్ని రెండింతలు చేస్తోంది. నయా-ఉదారవాద ఆర్థిక విధానాలు మహిళలను అనివార్యంగా ఉత్పత్తి రంగంలోకి తెస్తున్నాయి. ఉద్యోగాల్లో వారు పెద్ద ఎత్తున చేరాల్సి వస్తోంది. అదే సమయంలో సమాజంలో వేళ్లూని కుని ఉన్న పురుషాధిక్యత వారిని ఇంటిపని, వంట పనినుండి విముక్తిగానివ్వడం లేదు. మరోవైపు వినిమయదారీ సంస్కృతి మహిళలను సెక్స్‌ సింబల్స్‌గా మారుస్తున్నది. ప్రతినిత్యం లైంగిక వేధింపులకూ, దాడులకూ గురిచేస్తున్నది. సామాజికార్థిక రంగంలోనే కాకుండా ఎన్నికల రంగంలో కూడా మహిళలు ఇటువంటి విచిత్ర పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల వల్ల పెద్ద సంఖ్యలో గ్రామీణ మహిళలు పరిపాలనా రంగంలోకి అడుగిడుతున్నందుకు సంతోషించాల్సిందే. కాని అదే సమయంలో వారి అధికారాన్ని భర్తో, తండ్రో, తనయుడో వెనుకనుండి, కొన్ని సార్లు నేరుగా ఆమె కుర్చీని ఆక్రమించుకుని కూడా చెలాయిస్తుంటే మహిళా సాధికారికత అవహేళనకు గురవుతుంది.
సాధికారికత దృష్ట్యా చూసినప్పుడు మహిళలు ఇప్పటికీ ఓటుబ్యాంకుగానే ఉన్నారు కానీ రాజకీయాల్లో నిర్ణాయక శక్తులుగా లేరు. వీరిలో రాజకీయ చైతన్యం పెరిగినప్పుడు, ఆర్థిక స్వాతంత్య్రం లభించినప్పుడే అనుకున్నది సాధ్యమౌతుంది. కేవలం శుష్క వాగ్దానాలతో కోరుకున్న మార్పులు జరిగిపోవు. లోక్‌సభ అనుమతి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు దీనికి నిదర్శనం. పాలక పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఈ బిల్లుపట్ల వ్యవహరిస్తున్నందునే దశాబ్దం దాటినా అది చట్టానికి నోచుకోలేదు. ఒకటి రెండు రాజకీయ పార్టీలు మినహా అన్ని పార్టీలూ మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కావాలంటాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలన్నీ బిల్లుకు మోకాలడ్డుతాయి. అనేక రకాల కొర్రీలు పెడతాయి. అనేక పరిమితులున్నప్పటికీ స్థానిక సంస్థలకు మహిళలు గెలుపొందడం మహిళా సాధికారికత దిశగా పలు మార్పుకు అంకురం వేసింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించుకోగలిగితే వారి అభ్యున్నతికి అది మరింత దోహదపడుతుందనడంలో సందేహం లేదు. రాజకీయ పార్టీలకు మహిళల పట్ల నిజమైన గౌరవం, అసలైన ప్రేమాభిమానాలు ఉన్నాయా లేదా అనేదానికి రిజర్వేషన్‌ బిల్లుకు అవి మద్దతిస్తున్నాయా లేదా అనేదే అసలైన గీటురాయి. మహిళలు వంటింటికే పరిమితం కావాలన్న తిరోగమన భావజాలం ఒక వైపు, తమ రాజకీయ గుత్తాధిపత్యానికి బీటలు పడతాయన్న భయం మరోవైపు ఆ దిశగా కదలనివ్వటం లేదు. ఇప్పటికైనా పాలక పార్టీలు కపట నాటకాలకు తెరదించి మహిళా సాధికారికతకు చేయూతనివ్వాలి. చట్టసభల్లో రిజర్వేషన్లకు మద్దతివ్వడంద్వారా తమ చిత్తశుద్దిని చాటుకోవాలి.
Taags :

Vyasam. Prajasakti

ప్రజల కోసం ప్రజాశక్తి

Posted On Sat 01 Aug 00:01:49.165905 2015
         ప్రజల పత్రిక ప్రజాశక్తి నేటితో 34 సంవత్స రాలు ముగించుకుని 35వ వసంతంలోకి అడుగిడు తున్నది. ఈ సందరర్భంగా విజయవాడలో నేడు ప్రజాశక్తి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో 'సమకాలీన పరిస్థితులలో మీడియా' అనే అంశంపై సదస్సు జరుగుతున్నది. పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులు కామ్రేడ్‌ ప్రకాశ్‌ కరత్‌, వివిధ తెలుగు దినపత్రికల సంపాదకులు, మాజీ సంపాదకులు శ్రీ కె రామచంద్ర మూర్తి, శ్రీ కె శ్రీనివాస్‌, శ్రీ రాఘవాచారి, శ్రీ ఈడ్పుగంటి నాగేశ్వరరావు, శ్రీ ఎస్‌ వీరయ్య, శ్రీ తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్‌ శ్రీ వి కృష్ణయ్య ప్రభృతులు సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. సుమారు 20 సంవత్సరాల తరువాత ప్రజాశక్తి హెడ్‌ ఆఫీసు విజయవాడలో మళ్లీ ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి, ముఖ్యంగా విజయవాడ చుట్టుప్రక్కల ఏర్పాటౌతున్న అమరావతి రాజధాని ఏరియా ప్రజానీకానికి ఎక్కువ సేవ చేయటానికి తమ సహకారాన్ని అందించాలని అన్ని తరగతుల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
1942లో తెలుగు నేలపై నెలకొల్పబడిన తొలి తెలుగు దినపత్రిక ప్రజాశక్తి. ఉద్యమ ప్రస్థానంతో పాటే పత్రిక ప్రస్థానం నడిచింది. దాంతో బాటే అనేక ఒడిదుడుకులు, నిర్బంధాలు ఎదుర్కొని సామాన్య ప్రజల పక్షాన నిలబడింది. మన ప్రియతమ నేత శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారి నేతృత్వంలో శ్రీ మోటూరు హనుమంతరావుగారి సంపాదకత్వంలో 1981 జనవరి 31న ప్రజాశక్తి తన దినపత్రిక ప్రస్థానాన్ని విజయవాడలో తిరిగి ప్రారంభించింది. అప్పటి నుంచి పత్రిక అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. దీనికి ప్రజానీకం పూర్తి మద్దతే ఆయువుపట్టు.
సమకాలీన వాస్తవ పరిస్థితులు ప్రజలకు చేరటం లేదు. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా ఆ పాత్రను సరిగ్గా నిర్వహించవల్సి ఉంది. ఉదాహరణకు మోడీ మొదటి సంవత్సరం పాలనపై నిష్పాక్షికమైన నిర్ధారణలు పత్రికలలో వచ్చింది చాలా తక్కువ. ఈ కాలంలో 300కు పైగా మత కల్లోలాలు దేశవ్యాప్తంగా జరిగాయి. గతంలో లాగా పెద్ద ఎత్తున కాకుండా చిన్నవిగా, క్లౌడ్‌ పద్ధతిలో మతకల్లోలాలు జరపటం కొత్త తరహా పద్ధతి. మేక్‌ ఇన్‌ ఇండియా లోగోను రూ.4.5 కోట్లు పెట్టి విదేశీ కంపెనీచే తయారు చేయించటం చూస్తే మన పాలకులకు స్వదేశీయత ఎంతవుందో అర్థమవుతుంది. ఆ లోగోను విదేశీ సంస్థ ఎక్కడో కాపీ కొట్టి తెచ్చిన విషయాన్ని ప్రజాశక్తి మినహా ఎవరూ రిపోర్టు చేయలేదు.
భూసమీకరణకు-పారిశ్రామీకరణ వెనుక బాటుకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల సర్వేలు తెలుపుతున్నాయి. కొత్తవి పెద్దగా రాకపోయినా ఉన్నవి ఈ సంవత్సరంలో 25,600 పరిశ్రమలు మూతపడినవంటే పరిస్థితి ఎంత తీవ్రంగా, ఆందోళనకరంగా ఉందో కారణాలను మీడియా విశ్లేషణ చేయాల్సి ఉంది.
దేశం వెలిగిపో తున్నదని నాటి వాజ్‌పేరు ప్రభుత్వం చెప్పగా నేటి మోడీ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సర్వే గ్రామీణ ప్రాంతం ఎంత దివాళాలో ఉన్నదో చెప్పిన వాస్తవాలను పరిశీలించి పాలక వర్గాలను బోనులో నిలబెట్టింది లేదు. 2014లో దేశంలో 12 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. వీటి కారణాలను, పరిష్కారాలను మీడియా లోతుగా పరిశీలించాలి.
గ్రామీణ ఉపాధి పథకాన్ని కుదించి వ్యవసాయ రంగం సబ్సిడీలను క్రమంగా రద్దు చేయటానికి ఉవ్విళ్ళూరుతున్న దేశ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నది లేదు. ఆర్థిక, సామాజిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి పోతుంటే దాన్నికాపాడే చర్యలపై చర్చించాల్సి ఉంది.
ప్రపంచం ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉందని రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ చెప్పిన సలహాలను పరిశీలించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆయన అధికారాలను కుదించాలనే ఆలోచనలను చేస్తున్న దంటే ఎంత నియంతృత్వంగా ఆలోచిస్తున్నదో అర్థమవుతున్నది.
ప్రధాని 21 దేశాలు పర్యటించినా వస్తున్న పెట్టుబడులు చాలా పరిమితంగానే ఉన్నాయి. వారు మన దేశంలో ఏ వస్తువులు అమ్ముడు పోతాయో వాటికి సంబంధించిన పరిశ్రమలనే పెట్టాలను కొంటున్న వాస్తవాలను ప్రజలకు చెప్పటం లేదు. అభివృద్ధి కావాలంటే మెజార్టీ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, అంటే గుట్టలు పడుతున్న సంపదను ఎక్కువ మందికి వివిధ పథకాల ద్వారా చేర్చాలి. ఈ ప్రత్యామ్నాయ వాస్తవాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.
ఈ విధానాల కోసం ప్రజాశక్తి పని చేస్తున్నది. ఈ లక్ష్యాల కోసం అనేక ఒడిదు డుకులను ఎదుర్కొం టున్నది. ఈ భావా లనూ ఆలోచ నలను ఇంకా విస్తృతంగా తీసుకె ళ్ళాలంటే ప్రజాశక్తి ఇంకా బాగా అభివృద్ధి కావాల్సి ఉంది.
ప్రపంచ మీడియాలో నూతన పోకడలు వస్తున్నాయి. టీవీకన్నా విస్తృతంగా నేడు సోషల్‌ మీడియా దూసుకుపోతున్నది. ప్రధానమంత్రి గొప్పగా ప్రకటించిన డిజిటల్‌ విప్లవం గుత్త పెట్టుబడిదారుల గుప్పెట్లో బందీగా ఉన్నంతకాలం అది సమాజంలోని క్రిందిస్థాయికి వెళ్లలేదు. ప్రభుత్వరంగంలో దానిని అభివృద్ధి చేసినప్పుడు అది సాధ్యమవుతుంది. ఆ నూతన ఒరవడులను అన్వయించుకోవడం ద్వారా ప్రజాశక్తి విశాల ప్రజానీకానికి చేరువ కావాల్సి ఉంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు గతం వలే అందించాలని కోరుతున్నాం.
2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత 67 శాతం, దేశంలో 22వ స్థానంలో ఉన్నాం. 5వ తరగతిలోపు చదువుతున్న వారు 25 శాతం ఉన్నారు. అంటే సగం మంది అక్షర జ్ఞానానికి ఆమడ దూరంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనుకున్న వ్యవసాయక రంగం అభివృద్ధి 2.5 శాతంతో, ఆత్మహత్యలతో ఎలా కునారిల్లుతున్నదో అర్థమవుతూనే ఉంది.
విదేశీ పరిశ్రమల రాకకోసం ముఖ్యమంత్రి ఎంతో ఆశతో ఉన్నారు. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోతుంటే పరిశ్రమలు మనగలగటం, కొత్తవి రాగలగటం కూడ కష్ట సాధ్యమే. ఇటీవల కేందం నుంచి వచ్చిన ఇండిస్టియల్‌ సబ్సిడీ రూ.1,250 కోట్లు చిన్న పరిశ్రమలకు దూరంగా కొద్దిమంది పెద్దవారి ఒడిలో చేరిపోవటానికి కారణం ప్రభుత్వానిది కాదా!
నిన్న మొన్న నీరు-చెట్టు గాని, నేడు ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్‌లుగాని, ఇసుక అమ్మకాల కుంభకోణాలు తమ
హస్తలాఘవానికి తోడ్పడుతున్నాయి. ఇక ఘనమైన రాజధాని కోసం చేస్తున్న, చేయిస్తున్న అప్పులు గతంలో అమెరికాలాగా, ఇటీవల గ్రీస్‌లాగా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడే అవకాశాలున్నాయని ప్రధాన మీడియా అంతగా ఆలోచించటం లేదనిపిస్తున్నది.
విభజన సమస్యను పాలకవర్గాలు తెలుగు జాతి మీద రుద్దగా తెలుగుజాతి ఐక్యత కోసం ప్రజాశక్తి అదురుబెదురు లేకుండా నిక్కచ్చిగా నిలబడింది. శ్రమజీవుల హక్కుల కోసం, వ్యవసాయ రక్షణకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ, మహిళల సామాజిక న్యాయం కోసం, శాస్త్రీయమైన విద్య, వైద్య విధానాలు వగైరా కోసం, ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాడుతున్న ప్రజానీకానికి ప్రజాశక్తి అండగా ఉంటుందని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాం.
మరోవైపున మీడియా స్వేచ్ఛకు అంతరాయం కలుగుతున్నది. ప్రజాస్వామానికి మీడియా నాలుగో స్తంభం అని అందరూ అంటుంటారు. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛను నిర్వీర్యం చేసే ఘటనలు దేశంలో వెల్లడి అయ్యాయి. అవినీతి, దోపిడీ విచ్చలవిడి అవుతున్నది. ఇందుకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులను దేశంలో కొన్ని చోట్ల బెదిరింపులు, దాడులు, హత్యలకు గురి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో 35 మంది జర్నలిస్టులు హత్య చేయబడ్డారు. ఇక భావ ప్రకటనా స్వేచ్ఛ ఎక్కడున్నట్లు? రానున్న రోజుల్లో జర్నలిస్టులపై హింసాకాండ మరింత పెచ్చరిల్లే పరిస్థితులు ఎదురు కానున్నాయి. ప్రభుత్వాలు దోషులపై మెతక వైఖరినే అవలంబిస్తున్నాయి. కనుక జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్రం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం కనబడుతున్నది. అందుకు అందరం గొంతు కలపాలి. ఐక్యతను పెంపొందించుకోవాలని కోరుతున్నాను.
- పాటూరు రామయ్య
Taags :

Sampadakeeyam. Prajasakti

నీటితో వాహనాలు ఎందుకు నడవవు?

Posted On Sat 01 Aug 22:27:52.745226 2015
          వాహనాలు నడిచేపుడు వాటిలో యాంత్రికశక్తి (ఎవషష్ట్రaఅఱషaశ్రీ వఅవతీస్త్రy) ఉంటుంది. ఆగిన వాహనంలో ఈ యాంత్రిక శక్తి ఉండదు. మరోమాటలో చెప్పాలంటే వాహనాన్ని నడపడం అంటే మనం ఆ వాహనానికి యాంత్రికశక్తిని ఇచ్చినట్టే. మరి ఆ యాంత్రికశక్తి ఎక్కడి నుండి వచ్చింది? శక్తి ఏ రూపంలో ఉన్నా ఆ శక్తిని ఏమాత్రం శూన్యం నుంచి ఉత్పత్తి చేయలేము. లేదా ఉన్న శక్తిని ఏ సాధనం ద్వారా కూడా నశింపజేయలేము. మనం లేదా ప్రకృతి చేయగలిగిందల్లా ఒక రూపంలో ఉన్న శక్తిని మరో రూపంలోకి మార్చడమే. ఉదాహరణకు కరెంటును ఉపయోగించి బల్బును వెలిగిస్తున్నామనుకుందాం. అందులో విద్యుచ్ఛక్తి, కాంతిశక్తి, ఉష్ణశక్తిగా మారిందన్న మాట. లెక్కల్లో చెప్పాలంటే ఉదాహరణకు 100 ప్రమాణాల విద్యుచ్ఛక్తి ఖర్చయితే అందులో 40 ప్రమాణాలు మనకు వెలుగును ఇచ్చే కాంతిశక్తిగా, మరో 60 ప్రమాణాలు మనకు వేడినిచ్చే ఉష్ణశక్తిగా మారిందన్న మాట. అంతేగానీ, ఆ 100 ప్రమాణాల విద్యుచ్ఛక్తి ఏ 50 ప్రమాణాల కాంతిశక్తిగా, 70 ప్రమాణాల ఉష్ణశక్తి (వెరసి మొత్తం 120 ప్రమాణాలు) గా మారలేదు. లేదా ఆ 100 ప్రమాణాల విద్యుచ్ఛక్తి ఏ 30 ప్రమాణాల కాంతిశక్తిగా, 40 ప్రమాణాల ఉష్ణశక్తిగా (వెరసి మొత్తం 70 ప్రమాణాలు) గా మారదు.
వాహనాలు నడవాలంటే వాటికి అవసరమయిన యాంత్రికశక్తి కూడా ఎక్కడి నుంచైనా లక్ష్యం కావాలి. అది పెట్రోలు, డీజిల్‌ వంటి సాధానాలలో రసాయనికశక్తి మాత్రమే పెట్రోలును గాలిలోని ఆక్సిజన్‌తో కలిపి మండిస్తే అది చాలా త్వరితంగా మండి పెద్ద మొత్తంలో ఉష్ణశక్తి వెలువడుతుంది. ఈ ఉష్ణశక్తిని సరియైన పద్ధతిలో వాహనాలు ఇంజన్లో యాంత్రికశక్తిగా మార్చుకొని, వాహనాన్ని నడుపుతారు. కాబట్టి ఇంధన ద్రవాలయిన పెట్రోలు, డీజిల్‌ లేదా ఎల్‌పిజి వంటి ఇంధన వాయువుల్లోని రసాయనిక శక్తిని వాహనాల ఇంజన్లలో ఉన్న అంతర్దాహన యంత్రం (×అ్‌వతీఅaశ్రీ జశీఎbబర్‌ఱశీఅ జుఅస్త్రఱఅవ) అనే సిలిండర్లలో యాంత్రికశక్తిగా మార్చుకోవడం ద్వారానే వాహనాలు నడుస్తాయి.
నీటిలో అలాంటి అధికస్థాయి రసాయనిక శక్తి లేదు. శక్తిపరంగా చూస్తే ఇంధనాలు అధికస్థాయిలో ఉన్నట్టు అర్థం. పైగా నీటికి, గాలిలోని ఆక్సిజన్‌కు రసాయనిక చర్యలు లేవు. వాటి రెండింటిని కలపడం ద్వారా ఏ విధమైన శక్తిని ఉత్పత్తి చేసే రసాయనిక ప్రక్రియలు లేవు. కాబట్టి వాహనాల ఇంజన్లలో నీటిని పోస్తే అవి చెడిపోవడం తప్ప నడిచేవి కావు.
అయితే సౌరశక్తి, మామూలు విద్యుచ్ఛక్తిని ఉపయోగించి నీటిలో ఉన్న ఆక్సిజన్‌ను, హైడ్రోజన్‌ను విడగొట్టితే ఏర్పడే హైడ్రోజన్‌ వాయువు గొప్ప ఇంధనంగా ఉపకరించగలదు. ఇక్కడ మనం ఏమి చేశాము. శక్తి విహీనంగా ఉన్న నీటి అణువులను కాంతి లేదా విద్యుచ్ఛక్తితో నింపి ఆ అణువుల్ని శక్తియుతమైన హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ వాయువులుగా సంపన్నవంతం చేశాము. ఇలా పోగుపడిన అధికశక్తిని తిరిగి అంతర్దాహన యంత్రాలలో యాంత్రికశక్తిగా మార్చుకొని, వాహనాలను నడపగలము. పెట్రోలు, డీజిల్‌ వంటి కర్బన్‌ ఇంధనాల బదులు కర్బన రహిత హైడ్రోజన్‌ ఇంధనం వాడకం పర్యావరణ పరిరక్షణ రీత్యా అభిలషణీయం!
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి, 
జనవిజ్ఞాన వేదిక.

News.prajasakti

గతి తప్పిన న్యాయం..!

Posted On 22 hours 5 mins ago
గతి తప్పిన న్యాయం..!
-  న్యాయమూర్తి జోసెఫ్‌ వాదనను పట్టించుకోలేదు
-  మాలెగావ్‌ సంఝౌతా కేసుల మాటేమిటి?
-  మెమన్‌ ఉరిశిక్షపై సిపిఎంఇండియా
న్యూస్‌నెట్‌వర్క్‌, న్యూఢిల్లీ:
            యాకూబ్‌ మెమన్‌ను ఉరితీయటం ద్వారా న్యాయం గతి తప్పిందన్న భావనకు ఆస్కారం ఏర్పడుతున్నదని సిపిఎం అధికార పత్రిక పీపుల్స్‌ డెమొక్రసీ వ్యాఖ్యానించింది. ఉరిశిక్షపడిన వ్యక్తికి శిక్షను మినహాయించేందుకు అనువైన పరిస్థి తులున్నా అతడిని ఉరితీయటంపై వ్యాఖ్యానిం చేందుకు ఇంతకన్నా మాటలు దొరకటం లేదని పీపుల్స్‌డెమొక్రసీ తన తాజాసంచిక సంపాద కీయంలో ఆవేదన వ్యక్తంచేసింది. ముంబయి పేలుళ్లలో దాదాపు 257 మంది ప్రణాలను బలి తీసుకున్న ఘటనలో యాకూబ్‌ మెమన్‌ దోషి అనేందుకు ఎటువంటిసందేహం అవసరం లేదని, అయితే ఈ నేరంలో అతడి పాత్ర మరణశిక్ష విధించాల్సినంత తీవ్రత కన్పించటం లేదని పీపుల్స్‌ డెమొక్రసీ అభిప్రాయపడింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన 11 మందిలో పదిమందికి న్యాయ వ్యవస్థ మరణశిక్షను రద్దుచేసి యావజ్జీవిత శిక్షగా మార్చిన విషయాన్ని ప్రస్తావించిన పత్రిక సంపా దకుడు ప్రకాశ్‌ కరత్‌ మెమన్‌కు కూడా యావజ్జీవిత శిక్షను విధించి వుంటే అటు బాధితులకు, ఇటు నేరస్తులకు కూడా న్యాయం జరిగిందన్న భావన కలిగేదన్నారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారులైన యాకూబ్‌ సోదరుడు టైగర్‌ మెమన్‌, దావూద్‌ ఇబ్రహీంల నుండి చట్టం అతడిని ఏకాకిని చేసిందని ఈసంపాదకీయం వ్యాఖ్యానించింది. యాకూబ్‌ మెమన్‌ పాకిస్తాన్‌ నుండి తిరిగి వచ్చి అధికారులకు లొంగిపోవటం ద్వారా వారికి సహకరించేందుకు సిద్ధమయ్యాడని, కుట్రదారులకు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏ విధంగా సహకరించిందో అమూల్యమైన ఆధారాల ద్వారా వివరించాడని, ఈ వాస్తవాన్ని మాజీ సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి బి రామన్‌ కూడా అంగీకరించారని గుర్తు చేసింది. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా సుప్రీంకోర్టు యాకూబ్‌ రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేయటం విచారక రమని పేర్కొంది. అంతేకాక యాకూబ్‌ దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను కూడా ముగ్గురు సభ్యుల ధర్మాసనం కొట్టివేయటం, ముఖ్యంగా విధానపరమైన లోపాలపై ధర్మాసనంలో సభ్యుడైన న్యాయమూర్తి కురియన్‌ జోసెఫ్‌ లేవనెత్తిన అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం పట్టించుకోకపోవటం దురదృష్టకరమని పీపుల్స్‌ డెమొక్రసీ సంపాదకీయం విచారం వ్యక్తం చేసింది. కనీసం రాష్ట్రపతి అయినా రాజ్యాంగంలోని 72వ అధికరణం ద్వారా తనకు లభించిన అసాధారణ అధికారాలను వినియోగించి మరణ శిక్షను రద్దుచేసి వుంటే యాకూబ్‌ కుటుంబ సభ్యులకు కొంత ఊరట లభించి వుండేదని, దురదృష్టవశాత్తూ ఇది కూడా చేయలేదని పత్రిక పేర్కొంది. యాకూబ్‌కు ముందు గతంలో అఫ్జల్‌ గురును 2013 మార్చిలో ఉరితీసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పటికీ శిక్ష అమలుపై చూపిన ఆరాటం దాని అసలు ఉద్దేశాలను తెలియజేస్తోందని వివరించింది. మరణశిక్షలపై దాఖలైన అప్పీళ్ల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ధర్మాసనంలో సభ్యులైన న్యాయ మూర్తులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అసమగ్రంగా వున్నాయని వ్యాఖ్యానించింది. గత ఏడాది కూడా సుప్రీంకోర్టు ఉగ్రవాద సంబంధిత కొన్ని ప్రధాన కేసుల్లో విదించిన మరణశిక్షలను రద్దు చేసిందని, ముఖ్యంగా మాజీ ప్రధాని రాజీవ్‌ హత్యకేసువంటి అతి ప్రధానమైనకేసుల్లో సైతం దోషులకు మరణ శిక్షను రద్దుచేసి యావజ్జీవిత శిక్షగా మార్చిందని కరత్‌ తన సంపాదకీయంలో గుర్తుచేశారు. తరువాత ఉగ్రవాద సంబంధిత పేలుడు కేసులో అరెస్టయిన దేవేందర్‌పాల్‌సింగ్‌ భుల్లార్‌ కూడా మరణశిక్ష నుండి మినహాయింపు పొంది యావజ్జీవిత ఖైదీగా మారిపోయాడని వివరించింది. ఈ రెండు కేసుల్లోనూ తమిళనాడు, పంజాబ్‌ల నుండి రాజ కీయంగా వచ్చిన గట్టి వత్తిడి కారణంగానే ఈ మిన హాయింపు లభించిందని తెలిపింది. వాస్తవానికి 2004 నుండి గడచిన పదకొండేళ్ల కాలంలో ఇప్పటి వరకూ ముగ్గురు ఖైదీలు మాత్రమే ఉరికంబం ఎక్కారని, పాకిస్తాన్‌ జాతీయుడైన అజ్మల్‌ కసబ్‌ను మినహాయిస్తే మిగిలిన ఇద్దరూ అఫ్జల్‌ గురు, యాకూబ్‌ మెమన్‌ ముస్లింలేనని గుర్తుచేసింది. మన దేశ న్యాయవ్యవస్థలో తాము వివక్షకు గురవు తున్నామన్న భావనకు ఈ వాస్తవం మూలకారణ మవుతున్నదని దీనిని ఒవైసీ వంటి వారు మతోద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ఉపయోగిం చుకుంటున్నారని వివరించింది. ఉగ్రవాద నిందితుల పట్ల బిజెపి, శివసేన తదితరులు ప్రదర్శిస్తున్న రక్త దాహం ఇందుకు భిన్నమైనదని ఈ సంపాదకీయం పేర్కొంది. అజ్మీరీ షరీఫ్‌, మాలేగావ్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుళ్ల వంటి ఘటనలను పరిశీలిస్తే హిందూత్వ ఉగ్రవాదం మనకు కన్పిస్తుందని, ఇందు లో ప్రమేయం వున్న నిందితులకు మరణశిక్ష మాట అటుంచితే కనీసం శిక్షలైనా పడతాయా అన్నది సందేహాస్పదమేనని పత్రిక వ్యాఖ్యానించింది. మరణ శిక్షలను రద్దు చేయాలని సిపిఎం దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ ప్రాధాన్యతను యాకూబ్‌మెమన్‌ ఉదంతం మరోసారి మన కళ్లకు కడుతోందని పీపుల్స్‌ డెమొక్రసీ గుర్తు చేసింది. మరణశిక్ష అన్నది ఏకపక్షమైనదని, అత్యంత అరుదైన ఈ ప్రక్రియకు న్యాయమూర్తులు విభిన్న భాష్యాలు చెబుతున్నారని వివరించింది. ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం మరణశిక్షకు గురవుతున్న వారిలో అధికశాతం మంది సామా జికంగా అణచి వేతకు గురవుతున్న వర్గాలకు చెందినవారేనని తెలుస్తు న్నదని పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. అనేక మంది మాజీ న్యాయమూర్తులు కూడా మరణశిక్షకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న ప్రస్తుత తరుణంలో ఈశిక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌కు ప్రజాభిప్రాయాన్ని, పార్టీల మద్దతును కూడగట్టటం అవసరమని, సిపిఎం ఈ దిశగా తన వంతు కృషిని కొనసాగిస్తుందని పీపుల్స్‌ డెమొక్రసీ ఉద్ఘాటించింది.

Cpm manubolu-sadasu

--- --- Sent by WhatsApp