యువత భవితకు భరోసా ఎప్పుడు...?
Posted On Thu 03 Sep 23:08:26.902453 2015
భారతవనిలో ఉపాధి ఎండమావిగా మారింది. ఎంతో శ్రమించి సంపాదించు కున్న సర్టిఫికెట్లకు విలువ లేకుండా పోతోంది. ఉపాధి కల్పించాల్సిన మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలకు ఊడిగం చేస్తూ యువతను విస్మరిస్తున్నాయి. విద్యార్హతలతో నిమిత్తం లేకుండా ఏదో ఒక పనిచేసుకొని కుటుంబాలను పోషించుకోవాల్సిన దీనావస్థలోకి నెడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న దారులు పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల ప్రయోజనాలు కాపాడేలా ఉన్నాయి తప్ప నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేలాలేవు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగం పీకనులిమే పాలకుల ప్రయత్నాలు ఊపందుకోవడంతో ఉన్న ఉద్యోగాలను రక్షించుకోవాల్సిన స్థితిలో ఉద్యోగులున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు ఎర్రతివాచీ పరిచి ప్రభుత్వరంగాన్ని సర్వనాశనం చేయబూనుకోవడంతో కొత్త కొలువులకు అవకాశంలేకుండా పోతోంది. ప్రైవేట్ రంగం విస్తరిస్తున్నప్పటికీ ఆ మేరకు ఉ పాధి అవకాశాలు పెరగడం లేదు. 1991లో నాటి ప్రధాని పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలను యుపిఎ, మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాలు మరింత వేగంగా అమలుజరుపుతున్నాయి. ఫలితంగా 1,13,540 ఎస్‌సిలకు చెందిన పోస్టులు రద్దయ్యాయి. వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాఖల్లో దాదాపు 10 లక్షలకు పైగా ఖాళీ పోస్టులున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు, శాఖల్లో క్రమంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వేలో పదేళ్లలో ఉద్యోగుల సంఖ్య 16 లక్షల నుంచి 13 లక్షలకు తగ్గింది. దాదాపు ప్రభుత్వరంగ సంస్థల న్నింటి లోనూ ఇదే పరిస్థితి. దేశంలో ఏటా 1.2 కోట్ల మంది ఉద్యోగార్హత లతో బయటకొ స్తున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించేందుకు నిర్దిష్ట మైన చర్యలు చేపటా ్టల్సిన ప్రభు త్వాలు నిరు ద్యోగ సమస్యను మరింత పెంచే విధానాలను అమలుచేస్తున్నాయి.
మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఉన్నత చదువులు అందుబాటులో లేక, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో యువత కొట్టుమిట్టాడుతోంది. ఏటా మూడు లక్షల మందికి పైగా ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని బయటకు వస్తున్నారు. వీరిలో కేవలం 15 నుంచి 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఇది కూడా అత్యధిక భాగం మంది ఎటువంటి భద్రత, చట్టపరమైన సౌకర్యాలు వర్తించని కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో శాశ్వత స్వభావం కల్గిన ఖాళీలను భర్తీచేయకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో నియామకాలు చేపట్టి కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు వర్తింపజేయకుండా ప్రభుత్వమే వెట్టిచాకిరీ చేయించుకుంటోంది. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక రాజధానిగా చెప్పు కుంటున్న విశాఖ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కంపెనీలొస్తే ఉపాధి లభిస్తుందని భ్రమలు కల్పించి కారు చౌకగా భూము లు కాజేసిన పారిశ్రా మిక వేత్తలు పరిశ్రమ లు పెట్టాక ఉపాధి మాటె త్తడంలేదు. నిర్వాసి తులు, స్థానికుల ఉపా ధిపై చేసుకున్న ఒప్పందాలను అమలుచేయడంలేదు. అచ్యుతాపురం సెజ్‌లో ఏడాదికి ఎకరా రూపాయి చొప్పున వెయ్యి ఎకరాలు పొందిన శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్ యాజమాన్యం ఐదేళ్లలో 60 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి దశాబ్దమవుతున్నా 16 వేలకు మించి ఉపాధి కల్పించలేదు. కారుచౌకగా భూములు పొందిన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల్లో ఉపాధి కల్పించడంలేదు సరికదా కనీసం నిర్మాణ సమయంలో స్థానికులకు కూలి పనులు కూడా కల్పించడంలేదు. ఈ దగా చాలదన్నట్లు పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టి రైతులను, వారి భూములపై ఆధారపడి బతుకుతున్న పేదలు, వృత్తిదార్లను వీధులపాల్జేయాలని చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమలు బాగా విస్తరిస్తున్నాయన్న విశాఖలోనే ఉపాధి పరిస్థితిలా ఉంటే మిగిలిన జిల్లాల్లో నిరుద్యోగులకు ఉపాధి సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా8,46,65,533. వారిలో యువత 3,27,56,000 (42.6 శాతం) మంది ఉన్నారు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువజనుల శాతం 20.5 ఉంది. 'అండర్ ఎంప్లారుమెంట్ ద్వారా నైపుణ్యం లేని పనులు కల్పించకుండా, వారి శ్రమశక్తి దోపిడీకి గురికాకుండా, వారి అభివృద్ధి కుంటుపడకుండా, సరైన వయస్సులో తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా దేశాలపై ఉంది' అని 1948లో ఐక్యరాజ్యసమితి చేసిన మానవ హక్కుల డిక్లరేషన్‌లోని 26వ ఆర్టికల్ స్పష్టంగా పేర్కొంది. సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వాల పుణ్యమా అని ఇప్పటికీ బెంగాల్, కేరళ ప్రభుత్వాలు ఎంప్లాయిమెంట్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తున్నాయి. నిరుద్యోగ యువతకు నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడామాటే మరిచారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న భ్రమలకు గురై మోసపోకుండా యువత జాగరూకతతో వ్యవహరించాలి. ఉపాధి, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి. నిరుద్యోగానికి కారకులైన మోసగాళ్లను నిలదీయాలి. నిరుద్యోగ యువత పక్షాన నిష్పక్షపాతంగా పోరాడే శక్తుల వెనుక సమీకృతం కావాలి. తమ భవిష్యత్‌ను తామే తీర్చిదిద్దుకునే సమాజం కోసం ఆలోచించి కలిసి అడుగులు వేసినప్పుడే యువత భవిష్యత్‌కు భరోసా ఉంటుంది.
- అల్లు రాజు
(వ్యాసకర్త డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి)

Taags :
No comments:
Post a Comment