Wednesday, September 9, 2015




భ్రమ-వాస్తవం

Posted On Thu 10 Sep 

భ్రమ-వాస్తవం Posted On Thu 10 Sep

భ్రమ-వాస్తవం

Posted On Thu 10 Sep 00:04:08.682873 2015
       తెగించి పెట్టుబడులు పెట్టాలంటూ పారిశ్రామిక వేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అయోమయానికి, గందరగోళానికి అద్దం పడుతోంది. పెట్టుబడిదారులతో పాటు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి నష్టాలను భరించే శక్తి ప్రైవేటు రంగానికే ఉంటుందని కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ప్రధానమంత్రి నోటి వెంట వచ్చిన ఈ మాటలు ఆశావహ ధృక్పథాన్ని కాకుండా దానికి భిన్నమైన నైరాశ్యాన్ని ప్రతిబింబిస్తుండటం గమనార్హం. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంతో దేశం రూపురేఖలు మారిపోనున్నాయంటూ కొద్దిరోజుల క్రితం వరకూ ఊదరగొట్టిన ప్రచారానికి కూడా తాజా వ్యాఖ్యలు భిన్నం. గతంలో ఏ ప్రధాన మంత్రీ పర్యటించని విధంగా అనేక దేశాలను చుట్టివచ్చిన ఘనత నరేంద్రమోడిది! ఆ పర్యటనలతోనే పెట్టుబడిదారులు భారతదేశానికి క్యూ కట్టేస్తున్నారన్న విధంగా మోడీ, ఆయన వందిమాగాతులు గోబెల్స్‌ను మించిన ప్రచారం సాగించారు. తిమ్మిని బమ్మి చేస్తూ ఏడాదికి పైగా సాగిన ఈ ప్రచారం తరువాత దేశంలో భిన్నమైన వాస్తవం ఆవిష్కృతమైంది. విదేశీ పర్యటనల పేరిట వందల కోట్ల ధనం వృథా కావడం తప్ప సాధించినదేమీ లేదన్న విషయం ప్రజలకు అర్థం కావడం ప్రారంభమైంది. మరోవైపు మోడి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని విధాలా సహకరించిన కార్పొరేట్‌ శక్తులూ అసంతృప్తి రాగాలు ఆలపిస్తుండటంతో ప్రధాని నైరాశ్యంలో పడినట్లుంది. దాని వల్లనే నష్టాలను భరించడానికి సిద్ధ పడాలంటూ పారిశ్రామిక వేత్తలకు ఇచ్చి ఉంటారని భావించాలి.
లాభాలు వస్తాయంటే ఏం చేయడానికైనా, ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధ్దపడే పెట్టుబడి నష్టాలు వస్తాయంటే ఆమడ దూరంలో ఉంటుందన్నది అందరికీ తెలిసిన సత్యం. లాభాల పంట కోసం వ్యాపారాలు చేసే పెట్టుబడిదారులు తెలిసి తెలిసీ నష్టాల ఊబిలో దిగుతారని భావించడం అత్యాశే! వందలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడుల విషయంలో లాభం గురించి కాకుండా మరో విధంగా ఆలోచించాలని చెప్పడం పులిని గడ్డి తిని బతకమని చెప్పినట్లే ఉంటుంది. అయినా ప్రధాని ఈ తరహా ప్రకటన చేశారంటే రానున్న రోజుల్లో మరింతగా ముప్పు ముంచుకు రానుందనే అర్థం. వాస్తవానికి కొంత కాలంగా ఈ దిశలోనే ప్రయాణం చేస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను కమలనాథులు మసిపూసి మారేడు కాయ చేశారు. వాస్తవాలను దాచిపెట్టి నేల విడిచి సాము చేస్తూ అవే సత్యాలని దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కార్పొరేట్‌ మీడియా కూడా దీనికి సహకరించింది. అయితే, నిజాలను ఎల్లకాలం దాచి ఉంచడం ఎవరికీ సాధ్యం కాదు. కళ్లముందు కనపడుతున్న అంశాలే వాస్తవాలేమిటో వివరిస్తాయి. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వృద్ధి రేటు 8.5 శాతం దాటడం ఖాయమంటూ మోడి ఆయన మందీ మార్భలం ఊదరగొట్టింది. ఆర్థిక రంగ నిపుణులు అప్పట్లోనే ఇది వాస్తవ దూరమైన అంచనా అని చెప్పినా అంగీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాలేదు. లక్ష్యాన్ని సాధించి చూపుతామంటూ మాటలను కోటలు దాటించారు. కాని గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు మోడి బృందం ఊదుతున్న బుడగల్లోని గాలిని తీసేస్తున్నాయి. తాజాగా యుబిఎస్‌, మూడీస్‌ సంస్థలు భారతదేశ వృద్ధిరేటు 7 లేదా 7.1 శాతానికి మించకపోవచ్చని ప్రకటించాయి. తయారీ రంగ ఉత్పత్తి గత కొన్ని సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా వెనకబాటే పట్టింది. ప్రజల కొనుగోలు శక్తీ నానాటకీి తీసికట్టుగా మారుతుంటే దేశంలో కొనుగోళ్లు ఏ మాత్రం జోరందుకుంటాయి? కొనుగోళ్లు లేకపోవడంతో కార్ఖానాల మూసివేత బిజెపి పాలనలోనూ కొనసాగుతోంది. కొత్త ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టిన మాటలు, ఆచరణలో ఉన్నవి ఊడగొట్టడమేనని తేలిపోయింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అరకొరగా ఉన్న ఇతర ఉత్పత్తుల ఎగుమతులూ మందగించడంతో ఆర్భాటపు వృద్ధి రేటు అసాధ్యమని తేలిపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనైనా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాల్సి ఉంది. ఎండమావుల వెంట పరుగులు తీయడం బదులు దేశ ప్రజల కొనుగోలు శక్తిని మెరుగు పరచడానికి తక్షణ కార్యాచరణకు సిద్ధం కావాలి. ఉపాధి హామీ వంటి చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశ పూర్వకంగా నీరు గార్చడం వంటి చర్యలను తక్షణం విడనాడలి. దేశంలోని కార్మికవర్గం సెప్టెంబర్‌ 2వ తేదీన జరిపిన సమ్మె సందర్భంగా ముందుకు తెచ్చిన డిమాండ్లు నెరవేర్చడం కేవలం కార్మికవర్గ ప్రయోజనాల కోసం మాత్రమే కాదు. ఆ డిమాండ్లు నెరవేరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. దేశమంటే కార్పొరేట్లు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా అన్న విషయం మోడి సర్కారు తలకెక్కితే పరిస్థితి మారుతుంది. లేకుంటే కొద్ది మంది శతకోటీశ్వరుల ఖజానాలు నిండవచ్చునేమోగాని ఎంత మొత్తుకున్నా దేశ ఆర్థిక వ్యవస్థ ఉరకలు వేయడం సాధ్యం కాదు.
Taags :

పెరుగుతున్న ధరలు-ప్రతికూల ద్రవ్యోల్బణం

పెరుగుతున్న ధరలు-ప్రతికూల ద్రవ్యోల్బణం

Posted On Thu 10 Sep 00:03:47.487773 2015
        ద్రవ్యోల్బణం తగ్గుతున్నదని, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ప్రభుత్వా ధికారులు విశ్లేషణలు చేస్తున్నారు. హోల్‌సేల్‌ ధరల సూచి 2014 జులై కన్నా 2015 జులైలో 4.05 శాతం తక్కువగా నమోదయిందని, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడవ చ్చునని, కాబట్టి ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలని పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు డిమాండు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నది కాబట్టి రిజర్వు బ్యాంక్‌ ఈ నెల 17-18 తేదీలలో జరిగే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటుందని పారిశ్రామికవేత్తలు ఆశాభా వాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల జీవితాలకు సంబంధించి చూస్తే అధికారుల లెక్కలకు, వాస్తవ జీవితానికి పొంతన లేని పరిస్థితులున్నాయి. నిత్యావసర సరుకులన్నింటి ధరలు పెరుగుతున్నాయి. రోజువారీ ఆహారంలో వినియోగించుకొనే ప్రతి సరుకు ధర పెరిగిపోయింది. బియ్యం ధర కిలో రూ.40కి పైగా ఉంది. కందిపప్పు రూ.150కి చేరుకుంటున్నది. మినప, పెసర పప్పులు రూ.120 దాటి పెరుగుతున్నాయి. వేరుశనగ రైతులు దివాళా తీస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా, వేరుశనగపప్పు ధర మాత్రం కిలో రూ.120కి తగ్గటం లేదు. చింతపండు, పంచదార, బెల్లం, ఇతర ఏ సరుకుల ధరలూ తగ్గలేదు. నిజ జీవితంలో ధరలు పెరుగుతుంటే, ద్రవ్యోల్బణం తగ్గుతున్నదని అధికారులు ఎందుకు ప్రకటిస్తున్నారు?
ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని లెక్కించటానికి అనుసరిస్తున్న విధానంలోనే ఇందుకు మూలాలున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలను లెక్కించటానికి ప్రభుత్వం హోల్‌సేల్‌ ధరల సూచీ (డబ్లియుహెచ్‌ఐ), వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ)లను ప్రమాణాలుగా తీసుకొంటున్నది. హోల్‌సేల్‌ ధరల సూచీలో మూడు ప్రధాన భాగాలుంటాయి. ప్రాథమిక వస్తువులు, ఇంధనాలు, తయారీ సరుకులు ఉంటాయి. ప్రాథమిక సరుకులకు 20.1 శాతం, ఇంధనాలకు 14.9 శాతం, తయారీ సరుకులకు 65 శాతం ప్రాధాన్యత (వెయిటేజీ) ఉంటుంది. హోల్‌సేల్‌ మార్కెట్లో జరిగే అమ్మకాలు, కొనుగోలు ధరల ఆధారంగా హోల్‌సేల్‌ ధరల సూచీలో హెచ్చు తగ్గులుం టాయి. దాని ఆధారంగా హోల్‌సేల్‌ ధరల సూచీని నిర్ణయి స్తారు. హోల్‌సేల్‌ ధరల సూచీలో జాతీయ మార్కె ట్‌లోని ధరలతో పాటు అంతర్జాతీయ ధరల ఒడిదుడుకుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. అంతర్జాతీయంగా చమురు, ముడి సరుకుల ధరలు తగ్గాయి. హోల్‌సేల్‌ ధరల సూచీ ప్రకారం ఆహార సరుకుల ధరలు కూడా 1.16 శాతం మాత్రమే పెరిగాయి. కాబట్టి ధరలు తగ్గి, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులలోకి వెళ్ళబోతున్నట్లు నివేదికలు వెలువరిస్తున్నారు.
కానీ వినియోగదారుల ధరల సూచీ ప్రకారం చూస్తే ధరలు పెరుగుతున్నాయి. 2015 సంవత్సరంలో సగటు వినియోగదారుల ధరల సూచీ పెరుగుదల 5.96 శాతంగా ఉంది. హోల్‌సేల్‌ ధరలు, వినియోగదారుల ధరల సూచీల మధ్య సాధారణంగా ఒక శాతం వ్యత్యాసం ఉంటుంది. ఇపడు ఈ రెండింటి మధ్య 7-8 శాతం వ్యత్యాసం ఉంది. ఇంత వ్యత్యాసం ఉండటానికి కారణమేమిటి? ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి. అంతర్జాతీయంగా చమురు ధరలలో వచ్చిన గణనీయమైన తగ్గుదలను ప్రభుత్వం వినియోగదారులకు అందించలేదు. గత సంవత్సర కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 50 శాతానికి పైగా తగ్గగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను పెంచటం వల్ల చమురు ధరలు తగ్గిన ఫలితం వినియోగదారులకు చేరలేదు. దేశంలో చమురు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ముడిసరుకుల ధరలు కూడా తగ్గాయి. ముడి సరుకుల ధరలు తగ్గితే ఆ సరుకులతో తయారైన వినియోగ సరుకుల ధరలు కూడా తగ్గాలి. కానీ తయారీ సరుకుల ధరలు తగ్గలేదు. ఏ మేరకు ముడి సరుకుల ధరలలో తగ్గుదలను ఫ్యాక్టరీ యజమానులు తమ లాభాలను అదనంగా పెంచుకోవటానికి వినియోగించుకున్నారు.
రెండవది. హోల్‌సేల్‌ ధరల సూచీలో ప్రాథమిక సరుకులకు 20.1 శాతం ప్రాధాన్యతను ఇవ్వగా, అందులో ఆహార సరుకులకు 14.3 శాతం ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ వినియోగదారుల ధరల సూచీలో ఆహార సరుకులకు 45.86 శాతం ప్రాధాన్యతను ఇచ్చారు. అంటే హోల్‌సేల్‌ ధరల సూచీకన్నా వినియోగదారుల ధరల సూచీలో ఆహార సరుకులకు మూడు రెట్లకుపైగా ప్రాధాన్యతను ఇచ్చారు. ఆహారధాన్యాలు కళ్ళాల్లో ఉన్నపుడు, ధాన్యం ఇళ్ళకు చేరగానే సామాన్య రైతాంగం అమ్మటానికి పూనుకున్నపుడు వారిలో ఎక్కువ మంది కనీసమైన గిట్టుబాటు ధరలను కూడా పొంద లేకపోయారు. ప్రస్తుతం ఆహార సరుకులతో పాటు నిత్యా వసరాల సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. వినియోగదారుల ధరల సూచీలో ఆహార సరుకులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి ధరల సూచీ ఎక్కువగా పెరిగింది.
హోల్‌సేల్‌ ధరలు, వినియోగదారుల ధరల సూచీకి మధ్య ఉన్న వ్యత్యాసానికి కారణాలు ఇపుడు స్పష్టమౌతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గటం వలన వినియోగదారులు పొందవలసిన ప్రయోజనాన్ని ప్రభుత్వం వారికి దక్కకుండా చేసింది. ముడి సరుకుల ధరల తగ్గుదల వలన తయారీ సరుకుల ధరలు తగ్గి వినియోగదారులు పొందవలసిన ప్రయోజనాన్ని పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు స్వంతం చేసుకున్నాయి.
ఆ విధంగా పెట్టుబడి దారులు ప్రజలను దోపిడీ చేసి అక్రమ లాభాలు పొందుతుంటే, వారిని నిలువరించి, ఆ దోపిడీని అరికట్టటానికి ప్రభుత్వమూ పూనుకోలేదు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు పొందలేక రైతాంగం నష్టపోయి, ఆత్మహ త్యలు చేసుకొం టుంటే రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ఆహారధాన్యాల ధరలు పెంచి, ప్రజలను కొల్లగొట్టి, బడా వ్యాపారులు అపారలాభాలను స్వంతం చేసుకొంటున్నారు. ఈ విధంగా దోపిడీ తీవ్రం కావటమే హోల్‌సేల్‌ ధరల సూచీకి, వినియోగదారుల ధరల సూచీకి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటానికి కారణంగా ఉంది. పరిస్థితి ఇలా ఉండగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నది కాబట్టి రిజర్వుబ్యాంకు సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపుకు చర్యలు తీసుకుంటుందని వ్యాపారవర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వడ్డీరేట్లు తగ్గితే రుణాలు చౌక అవుతాయి కాబట్టి పారిశ్రామిక వేత్తలు అధికంగా రుణాలు తీసుకుని ఉత్పత్తిని పెంచటానికి ప్రయత్నం చేస్తారని, వినియోగదారులు కూడా రుణాలు తీసుకొని సరుకులను కొనుగోలు చేయటాన్ని పెంచుతారని, ఆ విధంగా ఆర్థికవ్యవస్థ శీఘ్రంగా పెరుగుదల సాధిస్తుందని సరళీకరణవాదులు భావిస్తున్నారు. ఒకవేళ వారు భావిస్తున్నట్లే రిజర్వుబ్యాంకు 25 లేదా 50 బేసిస్‌ పాయి ంట్లు వడ్డీరేట్లు తగ్గించినా అభివృద్ధిని వేగవంతం చేయటం సాధ్యం కాదు. రెండు కారణాల రీత్యా ఇది సాధ్యం కాదు. మొద టిది. వడ్డీరేట్ల తగ్గింపు వలన పారిశ్రామికవేత్తలు ఎక్కువగా రుణాలు తీసుకొని ఉత్పత్తిని పెంచినా, ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోవటంతో ఆ ఉత్పత్తులను అమ్ముకోవటం సాధ్యం కాదు. కొనుగోలుశక్తిని పెంచకపోగా గతం కన్నా ఎక్కువగా ప్రజల కొనుగోలుశక్తిని హరిస్తున్నారని హోల్‌సేల్‌, వినియోగ దారుల ధరల సూచీల మధ్య పెరిగిన వ్యత్యాసం మనకు స్పష్టం చేస్తున్నది. కాబట్టి రుణం తీసుకొని తాత్కాలికంగా ఉత్పత్తిని పెంచినపుడు కొంత అభివృద్ధి జరుగుతున్నట్లు కనిపించినా, సరుకులు మార్కెట్లోకి వచ్చి, అమ్ముకోవాల్సి వచ్చినపుడు గతం కన్నా తీవ్రమైన మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండవది. ఆసియా దేశాలలోని మాంద్యం, అమెరికా ఆశించిన మేరకు కోలుకోలేకపోవటం తదితర కారణాల వలన ఎగుమతులకు కూడా అవకాశాలు తగుతాయి. అందువలన పారిశ్రామికా భివృద్ధిని పెంచటానికి వడ్డీరేట్లు తగ్గించకపోవ టమే ప్రధాన కారణమని పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలుచేసే వాదన సరికాదని స్పష్టమౌతున్న ది. హోల్‌సేల్‌ ధరల సూచీ గత సంవత్సరం కన్నా 4.05 శాతం తక్కువగా ఉండటానికి దేశీయంగా ప్రజల కోనుగోలుశక్తి తగ్గటమే ప్రధాన కారణం. ప్రభుత్వం ప్రజల కొనుగోలుశక్తిని హరించే చర్యలు తీసుకొంటు న్నది. గత రబీ సీజన్‌లో ప్రతికూల వాతావరణం వలన తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎటు వంటి సహాయం చేయ టానికి పూనుకోలేదు. ఈ సంవత్సరం దేశంలోని కొన్ని ప్రాంతాలలో సరైన వర్షాలు లేక రైతులు పంటలు వేయలేక పోయారు. అటువంటి ప్రాంతాల్లో వ్యవసా య కార్మికులకు పనులు తగ్గిపోయాయి. ఉపాధి హామీ పథ కాన్ని నీరు కార్చ టంతో గ్రామీణ ప్రాంత ప్రజల కొనుగోలుశక్తి తగ్గింది. ప్రభు త్వం ప్రారంభించిన కార్మిక సంస్కరణలతో కార్మికుల కొను గోలుశక్తి తగ్గుతుంది. నిరుద్యోగం పెరుగు తుంది. దేశ ప్రజల కొనుగోలుశక్తి తగ్గిన తర్వాత పారిశ్రామికా భివృద్ధి ఎలా సాధ్యమౌతుంది?
అందువలన ప్రభుత్వ విధానాలు మారితేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమౌతుంది. సంస్కరణలను వేగవంతం చేస్తే సంక్షోభం చేరువౌతుంది. దేశీయ మార్కెట్‌ విస్తరణకు చర్యలు తీసుకుంటే అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఆర్థికవ్యవస్థ ప్రతికూలాభివృద్ధిలోకి పోతుందనే భయాలు తొలగిపోతాయి. బిజెపి ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయటానికి కంకణం కట్టుకొని ముందుకుపోతున్నది కాబట్టి రానున్న కాలంలో ఆర్థికవ్యవస్థ మరింత అనిశ్చితిని, సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.
- ఎ కోటిరెడ్డి
Taags :

ఇదేమాట మొన్న బిజేపి మంత్రి వెంకయ్యనాయుడు చెప్పాడు, ఇపుడు టిడిపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెపుతున్నాడు ఇద్దరి మాట ఒకటే అదే ప్రపంచబ్యాంకు మాట.

రాబడి పెంచుకోండి

Posted On 5 hours 7 mins ago
రాబడి పెంచుకోండి
-  పట్టణాలు నగరాలకు ముఖ్యమంత్రి సూచన
-  మున్సిపాలిటీల పనితీరుపై ఆగ్రహం
-  పారిశుధ్య పరిస్థితి అధ్వానం
-  ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి

మండలరెవెన్యూకార్యాలయం వద్ద దర్నా 9-9-2015-బయోమెట్రిక్ తో సంబందంలేకుండా రేషన్ సరుకులు  ఇవ్వాలి. ఆధార్ లింకు అడు పెట్టి రేషన్ సరుకులు ఆపడం సుప్రిం కోర్టు తీర్పుకు విరుద్దము. కోర్టు దికారనేరంక్రింద ప్రభుత్వము ను ముద్దాయిని చేయాలని సిపియం డిమాండ్ చేస్తూంది.పేదలుకు ఇచ్చే రేషన్ కు ఇన్నిఇబ్బంలు కల్పించడం ఈ ప్రభుత్వము ఎవరిపక్షాన ఉందో అర్దంమవుతుందని సిపియం మండల కార్యాదర్శి కటికాల వెంకటేశ్వర్లు విమర్శించారు. మనుబోలులో 9-9-2015తేదీన మండల రెవెన్యూకార్యాలయం వద్ద ధర్నా జరిగింది. బి.సి.భాస్కర్, ఎస్.నరేంద్ర, టి.దేవదానం, ఎ.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మండలరెవెన్యూకార్యాలయం వద్ద దర్నా 9-9-2015-బయోమెట్రిక్ తో సంబందంలేకుండా రేషన్ సరుకులు ఇవ్వాలి.


మండలరెవెన్యూకార్యాలయం వద్ద దర్నా 9-9-2015-బయోమెట్రిక్ తో సంబందంలేకుండా రేషన్ సరుకులు  ఇవ్వాలి.

Sunday, September 6, 2015

me » AndhraPradesh విద్య ప్రభుత్వ బాధ్యత కాదు Posted On 17 hours 18 mins ago

విద్య ప్రభుత్వ బాధ్యత కాదు

Posted On 17 hours 18 mins ago
విద్య ప్రభుత్వ బాధ్యత కాదు
-  కార్పొరేట్లే భుజస్కంధాలపై వేసుకోవాలి
-  ప్రయివేటు వర్శిటీల బిల్లుకు కట్టుబడ్డాం
-  గురుపూజోత్సవంలో చంద్రబాబు
ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి
        'విద్య ప్రభుత్వ బాధ్యత కాదు. కార్పొరేట్లు సామాజిక బాధ్యత(సిఎస్‌ఆర్‌)గా తమ భుజస్కం ధాలపై వేసుకోవాలి. ఎక్కడైనా ఉన్నత విద్య అభివృద్ధి ఇలాగే జరిగింది. ప్రపంచం, దేశంలో యూనివర్శిటీల అభివృద్ధికి నమూనా ఇదే. హార్వర్డ్‌ యూనివర్శిటీయే ఇందుకు ఉదాహరణ. దీనికోసం ప్రయివేటు దాతలంతా 'కార్పస్‌' ఫండ్‌ ఏర్పాటు చేయాలి. ప్రయివేటు యూనివర్శిటీల బిల్లును అసెంబ్లీలో తీర్మానించాం. కేంద్రానికి పంపాం. ఆమోదం కూడా లభిస్తుందని ఆశిస్తున్నాం..' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్య విషయంలో ప్రభుత్వ బాధ్యతకు తిలోదకాలిచ్చే ప్రయత్నం చేశారు. శనివారం సాయంత్రం విశాఖపట్నంలోని ఎయు ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి టీచర్స్‌డేను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రా యూనివర్శిటీకి గొప్ప చరిత్ర ఉందని, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, సిఆర్‌ రెడ్డి ఇక్కడ విసిలుగా పనిచేయడం అదృష్టమని అన్నారు. 719 యూనివర్శిటీల్లో ఎయుకు 8వ స్థానం లభించడం అభినందనీయమని కొనియాడారు. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లడం వల్ల చైనా, జపాన్‌, అమెరికా వంటి దేశాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మన దేశంలోనే నాణ్యమైన విద్యకు బాటలు వేయాలని అన్నారు. ప్రాథమిక విద్య అత్యంత దారుణంగా ఉందని పేర్కొంటూ.. కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని దేశంలో 35 రాష్ట్రాలుంటే మనది 31వ స్థానమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా టీచర్‌ పోస్టు ఖాళీ ఉండే ప్రసక్తి లేకుండా చర్యలు తీసుకుంటానని, మౌలిక వసతులకు ఢోకా లేకుండా చేస్తానని తెలిపారు. అన్ని పాఠశాలల్లో టారులెట్లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ప్రధానోపాధ్యాయులకు ఐపాడ్‌లు ఇస్తామని, టీచర్లకు సైతం విస్తరిస్తామని తెలిపారు. 2019 నాటికి రాష్ట్రంలో శత శాతం అక్షరాస్యత సాధించాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. టీచర్లు ఎవ్వరూ రాజకీయ నాయకుల చుట్టూ తిరగకూడదనే కౌన్సిలింగ్‌ విధానం పెట్టి బదిలీలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో వంద కళాశాలలను టాటా సంస్థ దత్తత తీసుకుని వేలాది మంది విద్యార్థులను అభివృద్ధి చేసేందుకు ఎంఒయు కుదిరిందన్నారు. ఫిబ్రవరిలో విశాఖలో నేవీ ఫ్లీట్‌ జరగనుందని, 60 నుంచి 70 దేశాలు రాబోతున్నాయని తెలిపారు. జనవరిలో పారిశ్రామిక వేత్తల కాన్ఫెడరేషన్‌ విశాఖలో నిర్వహిస్తామన్నారు. త్వరలో రూ. 3,500 కోట్లతో సీమెన్‌ సంస్థ పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పనల అభివృద్ధి కోసం నిధులు వెచ్చిస్తోందని, దీంట్లో రూ. 350 కోట్లు అంటే పది శాతం ప్రభుత్వం తరపున సమకూరుస్తున్నామని తెలిపారు. తరువాత రాష్ట్ర, జిల్లా స్థాయిలో 158 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు చంద్రబాబు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎయు విసి ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు, రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎంపీ హరిబాబు, కలెక్టర్‌ యువరాజ్‌, విద్యాశాఖ ఉన్నతాధికారి బి.ఉదయలక్ష్మి, సిసోడియా, టిఇఎస్‌ఎస్‌ సంస్థ అధినేత పరశురాం, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బాబు ఎంట్రీతోనే సభలో షార్ట్‌ సర్క్యూట్‌
వేడుకల ప్రాంగణంలోకి చంద్రబాబు అడుగుపెడుతున్న సమయంలో ప్రెస్‌, అవార్డుల గ్యాలరీల వద్ద విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేశారు. లైట్లను కూడా ఆపేశారు. సాయంత్రం 3 గంటలకు రావాల్సిన ముఖ్యమంత్రి 5.30 గంటలకు వచ్చారు. ఉదయం 10.30 గంటలకే విద్యార్థులను తీసుకురావడంతో వారిలో అనేక మంది మధ్యాహ్నం తిండిలేక అలసటకు గురై కూర్చొన్నచోటే నిద్రపోవడం కనిపించింది.

Thursday, September 3, 2015

యువత భవితకు భరోసా ఎప్పుడు...?

Posted On Thu 03 Sep 23:08:26.902453 2015
               భారతవనిలో ఉపాధి ఎండమావిగా మారింది. ఎంతో శ్రమించి సంపాదించు కున్న సర్టిఫికెట్లకు విలువ లేకుండా పోతోంది. ఉపాధి కల్పించాల్సిన మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలకు ఊడిగం చేస్తూ యువతను విస్మరిస్తున్నాయి. విద్యార్హతలతో నిమిత్తం లేకుండా ఏదో ఒక పనిచేసుకొని కుటుంబాలను పోషించుకోవాల్సిన దీనావస్థలోకి నెడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న దారులు పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల ప్రయోజనాలు కాపాడేలా ఉన్నాయి తప్ప నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేలాలేవు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగం పీకనులిమే పాలకుల ప్రయత్నాలు ఊపందుకోవడంతో ఉన్న ఉద్యోగాలను రక్షించుకోవాల్సిన స్థితిలో ఉద్యోగులున్నారు. కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలకు ఎర్రతివాచీ పరిచి ప్రభుత్వరంగాన్ని సర్వనాశనం చేయబూనుకోవడంతో కొత్త కొలువులకు అవకాశంలేకుండా పోతోంది. ప్రైవేట్‌ రంగం విస్తరిస్తున్నప్పటికీ ఆ మేరకు ఉ పాధి అవకాశాలు పెరగడం లేదు. 1991లో నాటి ప్రధాని పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలను యుపిఎ, మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాలు మరింత వేగంగా అమలుజరుపుతున్నాయి. ఫలితంగా 1,13,540 ఎస్‌సిలకు చెందిన పోస్టులు రద్దయ్యాయి. వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాఖల్లో దాదాపు 10 లక్షలకు పైగా ఖాళీ పోస్టులున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు, శాఖల్లో క్రమంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వేలో పదేళ్లలో ఉద్యోగుల సంఖ్య 16 లక్షల నుంచి 13 లక్షలకు తగ్గింది. దాదాపు ప్రభుత్వరంగ సంస్థల న్నింటి లోనూ ఇదే పరిస్థితి. దేశంలో ఏటా 1.2 కోట్ల మంది ఉద్యోగార్హత లతో బయటకొ స్తున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించేందుకు నిర్దిష్ట మైన చర్యలు చేపటా ్టల్సిన ప్రభు త్వాలు నిరు ద్యోగ సమస్యను మరింత పెంచే విధానాలను అమలుచేస్తున్నాయి.
మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తరువాత ఉన్నత చదువులు అందుబాటులో లేక, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో యువత కొట్టుమిట్టాడుతోంది. ఏటా మూడు లక్షల మందికి పైగా ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకొని బయటకు వస్తున్నారు. వీరిలో కేవలం 15 నుంచి 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఇది కూడా అత్యధిక భాగం మంది ఎటువంటి భద్రత, చట్టపరమైన సౌకర్యాలు వర్తించని కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో శాశ్వత స్వభావం కల్గిన ఖాళీలను భర్తీచేయకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో నియామకాలు చేపట్టి కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు వర్తింపజేయకుండా ప్రభుత్వమే వెట్టిచాకిరీ చేయించుకుంటోంది. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక రాజధానిగా చెప్పు కుంటున్న విశాఖ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కంపెనీలొస్తే ఉపాధి లభిస్తుందని భ్రమలు కల్పించి కారు చౌకగా భూము లు కాజేసిన పారిశ్రా మిక వేత్తలు పరిశ్రమ లు పెట్టాక ఉపాధి మాటె త్తడంలేదు. నిర్వాసి తులు, స్థానికుల ఉపా ధిపై చేసుకున్న ఒప్పందాలను అమలుచేయడంలేదు. అచ్యుతాపురం సెజ్‌లో ఏడాదికి ఎకరా రూపాయి చొప్పున వెయ్యి ఎకరాలు పొందిన శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్‌ యాజమాన్యం ఐదేళ్లలో 60 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి దశాబ్దమవుతున్నా 16 వేలకు మించి ఉపాధి కల్పించలేదు. కారుచౌకగా భూములు పొందిన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల్లో ఉపాధి కల్పించడంలేదు సరికదా కనీసం నిర్మాణ సమయంలో స్థానికులకు కూలి పనులు కూడా కల్పించడంలేదు. ఈ దగా చాలదన్నట్లు పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టి రైతులను, వారి భూములపై ఆధారపడి బతుకుతున్న పేదలు, వృత్తిదార్లను వీధులపాల్జేయాలని చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమలు బాగా విస్తరిస్తున్నాయన్న విశాఖలోనే ఉపాధి పరిస్థితిలా ఉంటే మిగిలిన జిల్లాల్లో నిరుద్యోగులకు ఉపాధి సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా8,46,65,533. వారిలో యువత 3,27,56,000 (42.6 శాతం) మంది ఉన్నారు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువజనుల శాతం 20.5 ఉంది. 'అండర్‌ ఎంప్లారుమెంట్‌ ద్వారా నైపుణ్యం లేని పనులు కల్పించకుండా, వారి శ్రమశక్తి దోపిడీకి గురికాకుండా, వారి అభివృద్ధి కుంటుపడకుండా, సరైన వయస్సులో తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా దేశాలపై ఉంది' అని 1948లో ఐక్యరాజ్యసమితి చేసిన మానవ హక్కుల డిక్లరేషన్‌లోని 26వ ఆర్టికల్‌ స్పష్టంగా పేర్కొంది. సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వాల పుణ్యమా అని ఇప్పటికీ బెంగాల్‌, కేరళ ప్రభుత్వాలు ఎంప్లాయిమెంట్‌ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తున్నాయి. నిరుద్యోగ యువతకు నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడామాటే మరిచారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న భ్రమలకు గురై మోసపోకుండా యువత జాగరూకతతో వ్యవహరించాలి. ఉపాధి, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి. నిరుద్యోగానికి కారకులైన మోసగాళ్లను నిలదీయాలి. నిరుద్యోగ యువత పక్షాన నిష్పక్షపాతంగా పోరాడే శక్తుల వెనుక సమీకృతం కావాలి. తమ భవిష్యత్‌ను తామే తీర్చిదిద్దుకునే సమాజం కోసం ఆలోచించి కలిసి అడుగులు వేసినప్పుడే యువత భవిష్యత్‌కు భరోసా ఉంటుంది.
- అల్లు రాజు 
(వ్యాసకర్త డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి)
Taags :