నూరుశాతం లాభాల్లో హెరిటేజ్
Posted On: Thursday,October 20,2016
Posted On: Thursday,October 20,2016
- ఆస్తులు ప్రకటించిన నారా లోకేష్
- డిపాజిట్లురాని వారు, తక్కువ ఓట్లు వచ్చిన వారు విమర్శిస్తారా?
- పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఏపదవికైనా సిద్ధం
ప్రజాశక్తి - గుంటూరు సిటీ ప్రతినిధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్థాపించిన హెరిటేజ్ సంస్థ వంద శాతం లాభాల్లో నడుస్తోందని చంద్రబాబు తనయుడు, నారా లోకేష్ బుధవారం ప్రకటించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్ల చరిత్రలో హెరిటేజ్ సంస్థ అనేక అవార్డులను గెలుచుకుందన్నారు. కుటుంబ సభ్యులందరూ సమన్వయంతో సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామన్నారు. ఏడు రాష్ట్రాల రైతులతోపాటు 15 వేల మంది ప్రత్యక్ష పరోక్ష మేలు పొందుతున్నారన్నారు. ఇప్పటివరకు హెరిటేజ్ రూ.2500 కోట్ల టర్నోవర్‌తో నడుస్తోందన్నారు. ఈ ఏడాది 12శాతం వృద్ధి సాధించిందన్నారు. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు సంస్థను విస్తరించనున్నామన్నారు. ఇందులో రూ.40 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌గా ఉందన్నారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన కుమారుడు దేవాన్ష్ పేరిట రూ.13.88 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రుణం తీసుకుని ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. దేవాన్ష్ పేరున ఇంటి విలువ రూ.9.17 కోట్లుకాగా, ఎఫ్‌డిలు రూ.2.4 కోట్లు, బ్యాంకులో నగదు రూ.2.31 లక్షలున్నాయన్నారు. తన తల్లి భువనేశ్వరి పేరుతో రూ.38.66 కోట్ల ఆస్తులుంటే, అప్పులు రూ.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబునాయుడుకు రూ.3.73 కోట్ల ఆస్తులు, హైదరాబాద్‌లో రూ.3.68 కోట్ల నివాసం, రూ.1.52కోట్ల విలువైన కారు, రూ.3.59లక్షల నగదు ఉన్నాయన్నారు. కాగా రూ.3.06 కోట్ల మేర బ్యాంకులలో అప్పులు ఉన్నాయని తెలిపారు.
లోకేష్ ఆస్తులు మొత్తం రూ.14.50 కోట్లు, మొత్తం అప్పులు రూ 6.35 కోట్లు, నికర ఆస్తులు రూ.8.15 కోట్లు, హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాలు రూ.2.52కోట్లు, ఇతర కంపెనీల్లో వాటాలు రూ.1.64 కోట్లు, కారు విలువ రూ.93 లక్షలు కాగా, బ్రాహ్మణికి మాదాపూర్‌లో భూమి రూ.17 లక్షలు, జూబ్లీహిల్స్ నివాసం రూ.3.50 కోట్లు, చెన్నరులో వాణిజ్య స్థలం రూ.48 లక్షలు, మణికొండలో స్థలం విలువ రూ.1.23 కోట్లుగా ఉంటుందని చెప్పారు. చాలా తక్కువ ఓట్లు వచ్చిన వారు, డిపాజిట్లు రాని వారు సైతం టిడిపిని, ప్రభుత్వాన్ని విమర్శించడంలో నైతికత లేదని అన్నారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఏపదవి స్వీకరించడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. చినరాజప్ప విషయంలో తమ ఫొటోను వక్రీకరించారని, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉదయం నుంచి రాత్రి వరకు లోకేష్ జపం చేస్తున్నారన్నారు. నవంబరు ఒకటి నుంచి 30 వరకు జన చైతన్య యాత్రలను నిర్వహించి, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు.

No comments:
Post a Comment