Monday, October 24, 2016

Wednesday, October 19, 2016

నూరుశాతం లాభాల్లో హెరిటేజ్‌
Posted On: Thursday,October 20,2016
- ఆస్తులు ప్రకటించిన నారా లోకేష్‌
- డిపాజిట్లురాని వారు, తక్కువ ఓట్లు వచ్చిన వారు విమర్శిస్తారా?

- పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఏపదవికైనా సిద్ధం

ప్రజాశక్తి - గుంటూరు సిటీ ప్రతినిధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్థాపించిన హెరిటేజ్‌ సంస్థ వంద శాతం లాభాల్లో నడుస్తోందని చంద్రబాబు తనయుడు, నారా లోకేష్‌ బుధవారం ప్రకటించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్ల చరిత్రలో హెరిటేజ్‌ సంస్థ అనేక అవార్డులను గెలుచుకుందన్నారు. కుటుంబ సభ్యులందరూ సమన్వయంతో సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామన్నారు. ఏడు రాష్ట్రాల రైతులతోపాటు 15 వేల మంది ప్రత్యక్ష పరోక్ష మేలు పొందుతున్నారన్నారు. ఇప్పటివరకు హెరిటేజ్‌ రూ.2500 కోట్ల టర్నోవర్‌తో నడుస్తోందన్నారు. ఈ ఏడాది 12శాతం వృద్ధి సాధించిందన్నారు. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు సంస్థను విస్తరించనున్నామన్నారు. ఇందులో రూ.40 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌గా ఉందన్నారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన కుమారుడు దేవాన్ష్‌ పేరిట రూ.13.88 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రుణం తీసుకుని ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. దేవాన్ష్‌ పేరున ఇంటి విలువ రూ.9.17 కోట్లుకాగా, ఎఫ్‌డిలు రూ.2.4 కోట్లు, బ్యాంకులో నగదు రూ.2.31 లక్షలున్నాయన్నారు. తన తల్లి భువనేశ్వరి పేరుతో రూ.38.66 కోట్ల ఆస్తులుంటే, అప్పులు రూ.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబునాయుడుకు రూ.3.73 కోట్ల ఆస్తులు, హైదరాబాద్‌లో రూ.3.68 కోట్ల నివాసం, రూ.1.52కోట్ల విలువైన కారు, రూ.3.59లక్షల నగదు ఉన్నాయన్నారు. కాగా రూ.3.06 కోట్ల మేర బ్యాంకులలో అప్పులు ఉన్నాయని తెలిపారు. 
లోకేష్‌ ఆస్తులు మొత్తం రూ.14.50 కోట్లు, మొత్తం అప్పులు రూ 6.35 కోట్లు, నికర ఆస్తులు రూ.8.15 కోట్లు, హెరిటేజ్‌ ఫుడ్స్‌లో వాటాలు రూ.2.52కోట్లు, ఇతర కంపెనీల్లో వాటాలు రూ.1.64 కోట్లు, కారు విలువ రూ.93 లక్షలు కాగా, బ్రాహ్మణికి మాదాపూర్‌లో భూమి రూ.17 లక్షలు, జూబ్లీహిల్స్‌ నివాసం రూ.3.50 కోట్లు, చెన్నరులో వాణిజ్య స్థలం రూ.48 లక్షలు, మణికొండలో స్థలం విలువ రూ.1.23 కోట్లుగా ఉంటుందని చెప్పారు. చాలా తక్కువ ఓట్లు వచ్చిన వారు, డిపాజిట్లు రాని వారు సైతం టిడిపిని, ప్రభుత్వాన్ని విమర్శించడంలో నైతికత లేదని అన్నారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఏపదవి స్వీకరించడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. చినరాజప్ప విషయంలో తమ ఫొటోను వక్రీకరించారని, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉదయం నుంచి రాత్రి వరకు లోకేష్‌ జపం చేస్తున్నారన్నారు. నవంబరు ఒకటి నుంచి 30 వరకు జన చైతన్య యాత్రలను నిర్వహించి, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు.
https://www.facebook.com/katikala.venkateswarlu.9/videos/1165074860243784/

స్టేలు ఇలా వస్తాయి
-----------------------------
గురువారం రాత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తిరుముల వస్తున్నాడని తెలుసుకొని , అప్పటికప్పుడు తన టూర్ షెడ్యూల్ మార్చుకొని హుటాహుటిన తిరుమల వెళ్లిన నిప్పు .
ఈ తతగం అంతా ప్లాన్ చేసింది ఢిల్లీ లో ఉన్న బాబు బినామీ జడ్జి రమణ . 18 కేసులలో స్టేలు , NGT లో కేసు , స్విస్ చాలెంజ్ కేసు , ఓటుకి నోటు కేసు అన్నింటిలో మరోసారి నిప్పులా నింగికి దూసుకుపోవటం ఖాయం .
ఒకప్పుడు జిల్లా జడ్జిల నుండి సుప్రీం కోర్టు జడ్జిల వరకూ , ఎవ్వరూ రాజకీయ నాయుకుల తో కలిసేవారు కాదు , ఏదయినా సందర్భంలో కలిసినా మొఖం తిప్పుకొని వెళ్ళిపోయేవారు . ఎందుకంటే వాళ్ళిచే తీర్పులమీద ఈ నాయకుల ప్రభావం లేకుండా చూసుకొనేవాళ్ళు , అలానే బయట ప్రపంచానికి కూడా హుందాగా కనపడేవాళ్ళు .
కానీ ఈనాటి బినామీ జడ్జిలు బ్రోకర్లుగా మారి రాజకీయనాయుకాలకి , మిగతా జడ్జిలకి మధ్య సంధాన కర్తలుగా పని చేస్తున్నారు . పిల్లల పుట్టిన రోజుల దగ్గరనుండి , ఆడవాళ్ళ బారసాల ఫంక్షన్లు దాకా రాజకీయనాయకులు , జడ్జిలు ఒకరి ఇళ్ళకి ఒకరి రాకపోకలు సాగిస్తున్నారు .
రాజకీయనాయుకులతో న్యాయమూర్తులు ఇలా బహిరంగంగా చెట్టా పట్టాలు వేసుకొని తిరగటం ఇంతకు ముందెన్నడూ జరగలేదు, అందునా స్వయంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ . ఇక క్రింద కోర్టులలో న్యాయమూర్తులు నిజాయితీ గా తీర్పులు ఇస్తారని ఎలా నమ్మాలి ? అన్నీ వ్యవస్థలని బ్రష్టుపట్టిస్తున్నారు .
లీలావతి గెస్ట్ హౌస్ లో బస చేసిన చంద్రబాబు తెల్లవారుజామునే మీడియా కంటపడకుండా తన బినామీ జడ్జి అయిన రమణ ని వెంటపెట్టుకొని వెళ్లి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేసిన ప్రధాన న్యాయమూర్తితో మంతనాలు సాగించటం ఏమిటి ? ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉందా ?
http://kommineni.info/…/dailyartic…/content_20161015_15.php…
ఇది ఇలాగే కొనసాగితే ప్రజలలో విప్లవం రావటం ఖాయం .

Sunday, October 16, 2016

RSS కాషాయ భక్తులు .. కమ్యూనిస్టులకే శత్రువులు అనుకున్నారా . పోలీసులు , దళితులూ , మైనార్టీలు ఎవ్వరి మీదైనా వీరు కర్కశత్వం. ఈ రోజు కమ్యూనిస్టుల ఆఫీసులపై దాడులు చేశారు. రేపు ఇంకో రాజకీయ పార్టీ కావచ్చు, ఇంకెవరిపైనా కూడా దాడులు చేయొచ్చు. ప్రజాస్వామ్యం ఖూనీ ఎందుకు ? కమ్యూనిస్టులు సోషల్ మీడియా ద్వారా లేదా సైద్ధాంతికంగా రుజువు చేస్తున్నారు . అందుకే కాషాయ నకిలీ భక్తులు రెచ్చిపోతున్నారు . కమ్యూనిస్టులంటే దిమ్మ దిరిగే భయం వీరికి ..
This image is from their Tripura CPI(M) office march, during which they violently attacked police personnel and injuring a few. Almost the same thing happened in odisha. They also took out the march to Tripura CM Manik Sarkar's residence.
The mainstream media has conveniently ignored sangh violence yet again!

Saturday, October 15, 2016

సింగపూర్‌తో పోల్చి చూస్తే బాబు బండారం బట్టబయలు..
అభివృద్ధి పేరుతో ప్రజల నుంచి అవసరాని కంటే అనేక రెట్లు ఎక్కువ భూములు తీసుకుని కార్పొరేట్లకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెడుతున్నారు. చంద్రబాబు మంత్రివర్గాన్ని చూసినా, ఆయన చుట్టూ చేరినవారిని చూసినా కార్పొరేట్లు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులే కనిపిస్తారు..

Tuesday, October 11, 2016

భూ బకాసురులు

భూ బకాసురులు
5,400 ఎకరాల ప్రభుత్వ భూమి యథేచ్ఛగా ఆక్రమణ
అత్యధికంగా 'కన్నేగంటి' టిడిపి, వైసిపి నేతలూ ఆక్రమణదారులే
కొలనుకుదురులో అనుమతి లేకుండా రొయ్యల గుంటల
అధికారులకు భారీగా ముడుపులు?
భూమి విలువ రూ. 150 కోట్లు
'ప్రజాశక్తి' పరి'శోధన'
ప్రజాశక్తి-మనుబోలు
కనుచూపు మేర ప్రభుత్వ భూములు.. ఒకటి కాదు.. రెండు కాదు.. 5,400 ఎకరాలు.. వాటిపై భూ బకాసురుల కన్ను పడింది. అంతే అమాంతంగా ఆక్రమించేశారు.. అధికారులను లోబరుచుకున్నారు... ఎంచెక్కా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు... రొయ్యల గుంట సాగుకు దిగారు.. అధికారులకూ లంచాలను విదిల్చారు.. సుమారు 20 ఏళ్లుగా ఈ అక్రమ దందా సాగుతోంది. ఎక్కువ భాగం ముఖ్యమంత్రి పేషీ స్థాయిలో పలుకుబడి ఉన్న కన్నేగంటి సీఫుడ్స్‌ ఆక్రమించింది. తలా పాపం తిలా పిడికెడు అన్నట్టు టిడిపి, వైసిపి నాయకులూ భూములను ఆక్రమించారు. మనుబోలు మండలం కొలనుకుదురు గ్రామంలో జరుగుతున్న భూబాగోత కథా కమామీషు ఇది...
మండలంలోని కొలనుకుదురు గ్రామంలో ప్రభుత్వ భూములను బడా బాబులు ఆక్రమించారు. గ్రామంలో 521-సిలో 2,400 ఎకరాలు, అదే సర్వే నెంబరులోని సబ్‌ డివిజన్లలో మరో 3,053 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 5,453 ఎకరాలు. 1990 వరకూ ఈ భూములు ఎందుకూ పనికి రాకుండా ఉండేవి. ఉప్పు నేల కావడం, నీటి వసతి లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. 1995లో ఈ భూమిలో 70 మంది మాజీ సైనికులకు 500 ఎకరాలను పంపిణీ చేశారు. రెండు విడతల్లో ఒకసారి 500 ఎకరాలను, మరోసారి వెయ్యి ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. వారికి పట్టాలిచ్చారు. భూములు మాత్రం చూపలేదు. కొలనుకుదురు బంగాళాఖాతానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర పరివాహక ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో రొయ్యల సాగుకు అనుకూలం. దాంతో బడాబాబుల కన్ను పేదలకిచ్చిన భూములతోపాటు మిగిలినవాటిపైనా పడింది. లీజు పేరుతో పేదల నుంచి భూమిని తీసుకున్నారు. వారికిచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఎకరా మూడు లక్షల రూపాయలు. ఈ లెక్కన ఈ భూముల విలువ రూ. 150 కోట్లు. 1990-95లో గుంటూరు, విజయవాడకు చెందిన వారు, జిల్లాకు చెందిన టిడిపి, కాంగ్రెస్‌ (ప్రస్తుతం వైసిపి) నాయకులు భూములను యథేచ్ఛగా ఆక్రమించారు. విజయవాడకు చెందిన కన్నేగంటి సీఫుడ్స్‌ వారు ఏకంగా 400 ఎకరాలను దున్నేశారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి, ఈదగాలికి చెందిన బడా బాబులు, ఎన్‌డిసిసి మాజీ ఛైర్మన్‌ అనుచరులు 1000 ఎకరాలను, పూడిపర్తి పెద్దోళ్లు 500 ఎకరాలను ఆక్రమించారు. అల్లూరు మాజీ ఎంఎల్‌ఎ, ప్రస్తుత టిడిపి నాయకుని అనుచరులు మరో 1000 ఎకరాలను కబ్జా చేశారు. కబ్జాదారుల్లో వైసిపికి చెందిన ముఖ్యస్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారంతా రెవెన్యూ అధికారులను లోబరుచుకున్నారు. ఆ భూములకు తమ పేర్లపై పాసుపుస్తకాలు పుట్టించుకున్నారు. ఎంచెక్కా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఫలితంగా అధికారులకు భారీగా ముడుపులు ముట్టచెప్పారు. గూడూరు డివిజన్లో 2002లో పని చేసిన ఓ రెవెన్యూ డివిజన్‌ అధికారి (ప్రస్తుతం విశ్రాంత అధికారి) రూ.5 లక్షలు దండుకుని రొయ్యల సాగుకు అనుమతి ఇచ్చినట్టు అప్పట్లో ఆరోపణలు వెల్తువెత్తాయి. ఆక్రమణదారులు 20 ఏళ్ల నుంచి రొయ్యల సాగు చేస్తున్నారు. సముద్రం నుంచి ఒక కాలువను తవ్వి గుంటలకు నీటిని సరఫరా చేస్తున్నారు. రొయ్యల సాగుకు ఎవరూ అనుమతి తీసుకోకపోవడం గమనార్హం.ఈ మొత్తం భూములకు సంబంధించిన రికార్డులు మాయమైనట్టు తెలుస్తోంది.
మాజీ సైనికులకు శఠగోపం
గ్రామంలో 521-సిలో 5,453 ఎకరాల్లోని 70 ఎకరాలను 1995లో 70 మంది మాజీ సైనికులకు 500 ఎకరాలను పంపిణీ చేశారు. ఆక్రమణదారులు మాజీ సైనికుల నుంచి ఎకరా రూ. 3 లక్షల వంతున కొనుగోలు చేశారు. వాస్తవానికి డి ఫారం పట్టా అయినందున కొనుగోలు చేయకూడదు. అమ్మకూడదు. అందుకు విరుద్ధంగా ఇక్కడ జరిగింది. ప్రస్తుతం డీ రిజిస్ట్రర్‌ కన్పించడం లేదు. ఆక్రమణదారులు రొయ్యల సాగుకు దిగారు. పనిలో పనిగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు తాము సైనికుల భూమిని కొనుగోలు సాగుచేసుకున్నామంటూ కథలు చెబుతున్నారు. ఇక్కడ సరైన హద్దులు లేకపోవడమే ఇందుక్కారణం.
అడంగల్‌లో పేరు నమోదుకు రూ. 20 వేలు
మండలంలోని కొలనుకుదురు 521-సిలోని భూములకు రెవెన్యూ అధికారులు రూ. పది వేల నుంచి 20 వేలు దండుకుని అడంగల్‌లో పేరు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ఎకరాలకు ఏకంగా రిజిస్ట్రేషన్‌ కూడా చేసి ఉన్నారు. ప్రభుత్వ భూములకు ఎన్‌ఒసిలు మంజూరు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రభుత్వ భూమికి పట్టా భూమి అని ఇస్తే లక్షల్లో ముడుపులు వసూలు చేస్తున్నారు. సుమారు 300 ఎకరాలు మినహా మిగతా భూములకు ఇలాగే ఇచ్చేశారు.
శిస్తు వసూలు లేదు...అంతా దండకాలే...
వ్యవసాయ భూములకు ఎకరాకు రూ. 200 వంతున శిస్తు వసూలు చేస్తారు. ఆక్వా సాగుకు రూ. 500 వసూలు చేయాలి. కొలనుకుదురు గ్రామంలోని ఆక్వా భూములకు రూ. 500 లెక్కన శిస్తు వసూలు చేసిన దాఖలాలు లేవు. ఈ విషయమై విఆర్‌ఒ నర్మదను వివరణ కోరగా తాము శిస్తూ వసూలుకు వెళితే ఎవరూ ఇవ్వడం లేదని చెప్పారు. పట్టా భూములున్న వారు కడుతున్నారని తెలిపారు. శిస్తు కొందరు కట్టడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. 
తహశీల్దారు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం 
2011లో తహశీల్దారు వెంకట నారాయణమ్మ కన్నేగంటి సీఫుడ్స్‌ భూములను సర్వే చేశారు. వారు సాగు చేస్తున్న రొయ్యల భూముల్లో సుమారు 54 ఎకరాలు ఆక్రమించినవేనని తేల్చారు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. వారిపై ఇప్పటికీ చర్యలు లేవు. అలా ఫిర్యాదు చేశారని ఆ తహశీల్దారుకు అప్పట్లో ఉన్నతాధికారులు మొట్టికాయలు వేశారని అప్పట్లో చర్చనీయాంశమైంది.
పేదల భూములు 'కన్నేగంటి' పాలు
2000లో సర్వే నెంబరు 862 లో బద్దెవోలుకు చెందిన సలాది సాయి, సాయికృష్ణలకు సుమారు 5 ఎకరాల భూమికి పట్టాలిచ్చారు. మనుబోలుకు చెందిన ఆదిమూలం భవానీ, కన్నవరం మునెమ్మలకు 1995లో రెండున్నర ఎకరాల చొప్పున భూములు ఇచ్చారు. ఆ భూములను కన్నేగంటి సీఫుడ్స్‌ వారు ఆక్రమించారు. సర్వేలో ఆక్రమించారని తేలినా ఆ భూములను పేదలకు చూపలేదు. బాధితులు ప్రతి కలెక్టర్‌కూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామని వారు చెప్పారు. ఆ కంపెనీకి ముఖ్యమంత్రి పేషీ స్థాయిలో పలుకుబడి ఉందని తామేమీ చేయలేమని ఉన్నతాధికారులు అంటున్నట్టు సమాచారం.
టిడిపి నాయకుల చేతల్లోనూ..
మండలంలోని 521-సిలో కొలనుకుదురు, బద్దెవోలు, కట్టువపల్లి ఇతర ప్రాంతాలకు చెందిన 500 మందికి భూములు పంచి ఉన్నారు. పట్టాలిచ్చి చేతులు దులుపుకున్నారు. వారికి భూమిని చూపిన దాఖలాలు లేవు. అధికార పార్టీకి చెందిన బడానాయకులు ఆ భూములను ఆక్రమించి ఉన్నారు. గతంలో ఆ భూములను ఎస్‌బిక్యూ ఫ్యాక్టరీకి ఇచ్చారు. ఆ భూముల్లో రొయ్యల సాగుకు ఇబ్బందిగా మారుతుందని అధికారులపై ఆక్రమణదారులు రాజకీయ ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆ ఫ్యాక్టరీ చిల్లకూరు మండలానికి తరలి వెళ్లింది.
అనుమతి లేకనే ఆక్వా సాగు
మనుబోలు మండలం కొలనుకుదురు గ్రామంలో 521-సిలోని భూములకు ఆక్వా సాగుకు అనుమతి లేదు. ఆక్వా సాగు చేయాలంటే తప్పని సరిగా అనుమతి ఉండాలని మత్స్యశాఖ జెడి సీతారామరాజు చెప్పారు. ఫ్రెష్‌ వాటర్‌లో సాగు చేయాలంటే ఎటువంటి అనుమతులూ ఉండాల్సిన అవసరం లేదు. కోస్టల్‌ ప్రాంతాల్లో సముద్రపు నీటితో, బ్రాకెట్‌(నిల్వ) నీటితో సాగు చేయాలంటరా ఆ శాఖకు చెందిన జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం వారు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. నివేదికను తయారు చేస్తారు. నివేదికను చెన్నరులోని కోస్టల్‌ ఎగో కల్చర్‌ అథార్టీకి పంపుతారు. వారు పరిశీలించి అనంతరం హెక్టార్‌కు రూ. 500, 5 హెక్టార్లు దాటితే రూ.2 వేల నుండి 3 వేల వరకు నగదు కట్టించుకుని అనుమతి ఇస్తారు. ఇక్కడ ఎలాంటి అనుమతీ లేకపోవడంతో అధికారులు తనిఖీల పేరుతో ముడుపులు దండుకుని అవినీతికి పాల్పడుతున్నారు. గతంలో ఓ ఫిషరీస్‌ అధికారి ఈ ఆక్వా రైతులను బెదిరించి ముడుపులు దండుకున్న సంఘటనలూ ఉన్నాయి.

Monday, October 10, 2016

108 కష్టాలు

108 వాహనాల నిర్వహణ చేతులు మార డంతో ఆ సంస్థలో ఇప్పటివరకు పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్‌ సందిగ్ధంలో పడింది. వాహనాల మరమ్మతుల విషయమూ108 కష్టాలు
108 వాహనాల నిర్వహణ చేతులు మార డంతో ఆ సంస్థలో ఇప్పటివరకు పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్‌ సందిగ్ధంలో పడింది. వాహనాల మరమ్మతుల విషయమూ వివాదా స్పదంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం 436 వాహనాలు వివాదా స్పదంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం 436 వాహనాలు