Friday, February 24, 2017

యతిరాజులు గారికి జోహార్లు !!
--------------------------------
ప్రముఖ రచయిత, అనువాదకులు, అభ్యుదయవాది
ఏజి యతిరాజులు (82) ఈరోజు చనిపోయారు.
'ప్రజాశక్తి' పాఠకులకు ఆయన చిరపరిచితులు.
ఆయన అనేక తమిళ, హిందీ, తెలుగు రచనలను అనువదించారు.
రాహుల్ సాంకృత్యాన్, చిన్నప్పభారతి, గిజుభాయి, ems నంబూద్రిపాద్ వంటి ప్రముఖుల రచనలను ఆయన తెలుగులోకి అనువదించారు.
చిన్నప్పభారతి ప్రఖ్యాత నవలలు "సంఘం', "దాహం" ఆయనే తెలుగులోకి తెచ్చారు.
"అంటరానివాసంతం" నవలను తెలుగునుంచి తమిళంలోకి తర్జుమా చేశారు.
UTF, జనవిజ్ఞానవేదికలలో పనిచేశారు.
1935 ఆగస్టు 4న తమిళనాడులోని గుడియాత్తంలో జన్మించారు.
2017 ఫిబ్రవరి 23న చిత్తూరులో కన్ను మూశారు .
***
82 ఏళ్ళ వయసులోనూ ఆయన రోజూ చదువుతూనే ఉండేవారు.
ప్రజాశక్తి పత్రిక, రెండు మూడు కొత్త, పాత పుస్తకాలూ ఎప్పుడూ ఆయన పక్కనే ఉండేవి.
"ఇప్పటికీ ఇంతగా చదవాలని, రాయాలని మీకు తపన ఎలా ఉంటుంది?" అని
ఆ మధ్య ఓ రచయిత అడిగితే _
"రోజూ ఇప్పటికీ తింటున్నాను. ఊపిరి తీస్తున్నాను.
చదవటం కూడా అలాంటిదే ..!!" అన్నారట, నవ్వుతూ.
***
యతిరాజులు గారు తెలుగు, తమిళ, హిందీ సాహిత్య రంగంలో చేసిన
అనువాద కృషి ఎప్పటికీ గొప్పగా నిలిచి ఉంటుంది.
ఆయన స్మృతికి నివాళి .. (82)

No comments:

Post a Comment