Wednesday, January 25, 2017

మొలకెత్తిన పెసలుతో లాభాలెన్నో..!

                పెసలు అందరికీ తెలిసిన బలవర్థక ఆహారం. పెసరపప్పును కూడా అంతా ఉపయోగిస్తుంటారు. అయితే మొలకెత్తిన పెసలు వల్ల ఆరోగ్యానికి మంచి మేలు చేకూరుతుందని, శరీరంలో పేరుకుపోయే కొవ్వును ఇవి తొలగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
మొలకెత్తిన పెసలలో అధికంగా ఉన్న డైటరీ ఫైబర్‌ కొవ్వును కరిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.మొలకెత్తిన పెసలను తింటే త్వరగా ఆకలి వేయదు. దీంతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా ఆహారాన్ని తగ్గించి, బరువు కూడా తగ్గవచ్చు. డైటరీ ఫైబర్‌ అధికంగా ఉన్న కారణంగా ఇవి మలబద్ధకం సమస్యను పోగొడతాయి. తిన్నది సరిగ్గా జీర్ణం అయ్యేలా చూస్తాయి.శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొలకెత్తిన పెసలలో ఉన్నాయి.విటమిన్‌ ఎ, బి, సి, డి, ఇ, కె, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, విటమిన్‌ బి6, ఫాంటోథెనిక్‌ యాసిడ్‌ వంటివి మొలకెత్తిన పెసలలో సమృద్ధిగా లభిస్తాయి. దీనిని సంపూర్ణ పౌష్టికాహారంగా చెప్పవచ్చు. మొలకెత్తిన పెసలను తీసుకోవడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు పోతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తహీనత తొలగిపోతుంది.రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. మధుమేహం ఉన్న వారికి వీటివల్ల మేలు కలుగుతుంది.శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను తొలగించే యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.వృద్ధాప్య ఛాయలను మొలకెత్తిన పెసలు దరిచేరనివ్వవు. గ్యాస్‌, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలను ఇవి పూర్తిగా నివారిస్తాయి.

No comments:

Post a Comment