Thursday, December 8, 2016



నగదు రహిత లావాదేవీల అంతిమ పర్యవసానం పేదలు, రైతులు, చిన్న మధ్యతరగతి వ్యాపారులు దెబ్బతినిపోవడమే. వ్యవసాయరంగం కార్పొరేటీకరణ, చిన్న మధ్యతరగతి వ్యాపారాలన్నీ దెబ్బతిని బడా మాల్స్, సూపర్ మార్కెట్స్ కే లాభం చేకూరుతుంది. ఇప్పటికే దేశంలో అన్ని రాష్ర్టాల్లోరబీ పంట వేసిన రైతులు వద్ద నగదు లేక, అప్పు పుట్టక నానా యిబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే రైతులకు వ్యవసాయం మానుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి.
పాలకులు పెద్ద నోట్లు రద్దుచేసి తప్పుచేసింది. ప్రజలకు ఇబ్బందులు కలిపించి ప్రజల దృష్టి ప్రక్కకు మల్లించేందుకు,  నగదు రహిత లావాదేవీలు. దీని  ద్వారా మరో తప్పుచేస్తుంది. దీనివల్ల సైబర్ నేరాలు పెరుగుతాయి. దీనిని నివారణకు సరైన వ్యవస్థ లేదు. ఇంకా అనేక సమస్యలు తలయెత్తతాయ్.  పాలకులు ఒక తప్పును సరిచేసుకోలేక మరో తప్పు చేయడానికి సిద్ధపడుతుంది.  ఇవ్వని ప్రపంచబ్యాంకు విధానాలు. ప్రపంచబ్యాంకు వద్ద మెప్పు పొందేందుకు పాలకులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.  
పాలకులు పెద్ద నోట్లు రద్దుచేసి తప్పుచేసింది.  ఇప్పుడు మరలా ప్రజలకు ఇబ్బందులు కలిపించి ప్రజల దృష్టి ప్రక్కకు మల్లించేందుకు,  నగదు రహిత లావాదేవీలు. దీని  ద్వారా మరో తప్పుచేస్తుంది. దీనివల్ల సైబర్ నేరాలు పెరుగుతాయి. దీనిని నివారణకు సరైన వ్యవస్థ లేదు. ఇంకా అనేక సమస్యలు తలయెత్తతాయ్.  పాలకులు ఒక తప్పును సరిచేసుకోలేక మరో తప్పు చేయడానికి సిద్ధపడుతుంది.  ఇవ్వని ప్రపంచబ్యాంకు విధానాలు. ప్రపంచబ్యాంకు వద్ద మెప్పు పొందేందుకు పాలకులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోట్ల రద్దు నిర్ణయం తరువాత మొబైల్‌ బ్యాంకింగ్‌ అంటూ మరో కొత్త పాట పాడుతున్నాయి. భారతదేశంలో 68 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. అందులో 60 శాతం మందికి కనీసం సంతకం చేయడం కూడా రాదు. సెల్‌ఫోన్‌ వాడడం కూడా రాని వారు మొబైల్‌ బ్యాంకింగ్‌ను ఎలా ఉపయోగించుకోగలరు. మొబైల్‌ బ్యాంకింగ్‌ వల్ల బ్యాంకు సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది. స్వైపింగ్‌ మిషన్లతో కొనుగోళ్ల బిల్లులు చెల్లించడంలో సామాన్యులు ఆదమరిస్తే వ్యాపారులు ఎక్కువ సొమ్మును తమ ఖాతాల్లోకి మార్చుకుని, మోసాలకు పాల్పడే అవకాశాలూ లేకపోలేదు.