కష్టమొస్తే ప్రభుత్వంపై చిందులేస్తారా?
Sakshi | Updated: August 30, 2016 03:22 (IST)
- మీరు తప్పులుచేసి మాపై నిందలేస్తారా?
- రైతులు వేరే అలవాట్లతో డబ్బు ఖర్చు పెట్టుకుంటే నేనేమి చేయాలి?
- రైతు ముఖాముఖిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
సాక్షి, చిత్తూరు/బి.కొత్తకోట: మీకు కష్టమొచ్చిందని ప్రభుత్వంపై
చిందులేస్తారా..? అంతా బాగుంటే మేం గుర్తుకురాం, ఇబ్బందులొస్తే
గుర్తొస్తామా? మీలోమార్పు రావాలి.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులపై
ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె
నియోజకవర్గం కురబలకోట మండలంలోని ముదివేడు సమీపంలో రక్షిత నీటి తడులపై
రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు..
వాతావరణ పంటల బీమా పథకం అమలు చేస్తున్నామని రైతులంతా పంటలకు బీమా
చేయించారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రైతులు చేయలేదు.. మాకు
తెలియదని బిగ్గరగా చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు.
అధికార యంత్రాంగాన్ని మీ వద్దకే పంపాం, అయినా బీమా చేయించలేదంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రయోజనం ఉందంటూనే.. సమస్యలు ఉన్నప్పుడే మేం (ప్రభుత్వం) గుర్తొచ్చి విర్రవీగుతారని వ్యాఖ్యానించారు. మీరు తప్పులు చేసి మాపై నిందలేస్తారా? అని సీఎం రైతులను ప్రశ్నించారు. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దన్నారు. గంటకుపైగా సాగిన ముఖాముఖి మధ్యలో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడటం వెనుక వేరే అలవాట్లు కారణమని, దీనికి తానేమీ చెయ్యలేనని చంద్రబాబు చెప్పారు. కాగా, త్వరలో రైతులకు రూ.5 లక్షల బీమా పథకం అమల్లోకి తీసుకొస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు

No comments:
Post a Comment