
Pages
▼
Wednesday, August 31, 2016

కరువొచ్చాక బావి తవ్వుతారా?
- వెనకటికొకడు కరువొచ్చాక తీరిగ్గా బావి తవ్వడం మొదలు పెట్టాడట.
- చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్ర బాబు ధోరణి అచ్ఛం అలాగే ఉంది. నెల రోజులుగా చినుకు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే పుష్కర వేడుకలు, తాత్కాలిక సచివాలయ ప్రారంభ సంబరాలలో సి. ఏం , మంత్రి పుంగవులు, అధికార గణాలు అమితానందం లో పరవశించి పోయారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడేమో ఒక్క ఎకరం లో కూడా పంట ఎండిపోవడానికి వీల్లేదంటూ పటాలాన్ని పక్కనేసుకొని రైన్ గన్లు పట్టుకొని గ్రామాల్లో తెగ హడావ...
మరింత చూడండి

- వినాయకచవితి పండుగ సందర్బంగా చీరలు, వినాయకుడి విగ్రహంతో పాటు వివిధ వస్తువుల కోసం షాపింగ్ చేసి రూ. 8 లక్షలు బిల్లు కార్యాలయం అధికారి ఐఎఎస్ రశ్నివర్మగారికి ఆ బిల్లు పాస్ చెయ్యాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. నేను బిల్లు పాస్ చెయ్యలేదని కేబినెట్ సెక్రటరీకి సమాచారం ఇచ్చారు.
- కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలో మార్పు రాకుంటే తాను ఆ శాఖలో పని చెయ్యలేనని రశ్మి వర్మ పై అధికారులకు చెప్పారు.

సెప్టెంబర్ 2న సమ్మె యథాతథం
కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2న తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ స్పష్టం చేశారు. కనీస వేతన సలహా కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ ప్రకటన పూర్తి అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించిందని కేంద్రమంత్రుల బృందం మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మిక సంఘాల కనీస వేతనంతో పాటు పలు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్న ప్రకటన మోసపూరితమని, పరిహాసంగా ఉందని తపన్‌సేన్ విమర్శించారు. http://mantenasitaram.blogspot.in/2016/08/2.html

మధు అరెస్టులకు వ్యతిరేకంగా రాజమండ్రి, కాకినాడలలో నిరసనలు..
తొండంగి మండలంలో దివీస్ కంపెనీ ఏర్పాటును వ్యతికించిన రైతులపై ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించింది.దాడికి గురైన బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి,మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ పి. మధు,జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దువ్వా శేషబాబ్జి లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం,కాకినాడలలో నిరసన కార్యక్రమాలు..కాకినాడలో దిష్టిబోమ్మదగ్ధం చేశారు..

కష్టమొస్తే ప్రభుత్వంపై చిందులేస్తారా?
Sakshi | Updated: August 30, 2016 03:22 (IST)
- మీరు తప్పులుచేసి మాపై నిందలేస్తారా?
- రైతులు వేరే అలవాట్లతో డబ్బు ఖర్చు పెట్టుకుంటే నేనేమి చేయాలి?
- రైతు ముఖాముఖిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
సాక్షి, చిత్తూరు/బి.కొత్తకోట: మీకు కష్టమొచ్చిందని ప్రభుత్వంపై
చిందులేస్తారా..? అంతా బాగుంటే మేం గుర్తుకురాం, ఇబ్బందులొస్తే
గుర్తొస్తామా? మీలోమార్పు రావాలి.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులపై
ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె
నియోజకవర్గం కురబలకోట మండలంలోని ముదివేడు సమీపంలో రక్షిత నీటి తడులపై
రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు..
వాతావరణ పంటల బీమా పథకం అమలు చేస్తున్నామని రైతులంతా పంటలకు బీమా
చేయించారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రైతులు చేయలేదు.. మాకు
తెలియదని బిగ్గరగా చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు.
అధికార యంత్రాంగాన్ని మీ వద్దకే పంపాం, అయినా బీమా చేయించలేదంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రయోజనం ఉందంటూనే.. సమస్యలు ఉన్నప్పుడే మేం (ప్రభుత్వం) గుర్తొచ్చి విర్రవీగుతారని వ్యాఖ్యానించారు. మీరు తప్పులు చేసి మాపై నిందలేస్తారా? అని సీఎం రైతులను ప్రశ్నించారు. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దన్నారు. గంటకుపైగా సాగిన ముఖాముఖి మధ్యలో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడటం వెనుక వేరే అలవాట్లు కారణమని, దీనికి తానేమీ చెయ్యలేనని చంద్రబాబు చెప్పారు. కాగా, త్వరలో రైతులకు రూ.5 లక్షల బీమా పథకం అమల్లోకి తీసుకొస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు
అధికార యంత్రాంగాన్ని మీ వద్దకే పంపాం, అయినా బీమా చేయించలేదంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రయోజనం ఉందంటూనే.. సమస్యలు ఉన్నప్పుడే మేం (ప్రభుత్వం) గుర్తొచ్చి విర్రవీగుతారని వ్యాఖ్యానించారు. మీరు తప్పులు చేసి మాపై నిందలేస్తారా? అని సీఎం రైతులను ప్రశ్నించారు. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దన్నారు. గంటకుపైగా సాగిన ముఖాముఖి మధ్యలో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడటం వెనుక వేరే అలవాట్లు కారణమని, దీనికి తానేమీ చెయ్యలేనని చంద్రబాబు చెప్పారు. కాగా, త్వరలో రైతులకు రూ.5 లక్షల బీమా పథకం అమల్లోకి తీసుకొస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు