Monday, October 19, 2015

Press mee

మనుబోలు
తేది:- 19-10-2015
ప్ర చూరణార్దం
మనుబోలు మండలంలోని తహసిల్దార్ కార్యాలయం లో రైతాంగానికి సంబందించిన పట్టాదారుపాసు పుస్తకములు, టైటిల్ డీడ్లు 3/2015 నుండి 22/7/2015 వరకు13గ్రామాలలో 78 పాసుపుస్తకాలుకు అప్లైచేసుకోగా 36 మందికి పాసుపుస్తకాలే రాలేదు. 42 మందికి టైటిల్ డీడ్లు రాలేదు. ఇటీవల చాలా మంది పాసుపుస్తకాలుకు అప్లై చేసి యున్నారు. వీరికి టైటిల్ డీడ్లు రానందున బ్యాకులు వారు క్రాప్ లోన్లు ఇవ్వనంటున్నారు. ఈ విదంగా ప్రభుత్వము రైతాంగాని ఇబ్బందులుకు గురిచేస్తున్నది. జన్మభూమిలో అనేక విషయాలు బయటపడినవి భూములనీ ఎక్కువ భాగం తపులు తడికలుగా వున్నాయని బయటపడింది. వీటిని సరిచేయుటకు తగినంత సిబ్బంది లేక రైతాంగాని ఆఫీసులు చుట్టూ తిపుకుంటూ, పలుకుబడి కల్గిన వారికి పనులౌతున్నాయి, లేని వారు పడిగాపులు పడుతున్నారు. దీనిని బట్టి ప్రభూత్వం యొక్క నిజస్వరూపం అర్దమోతుందని ఈ ప్రభుత్వము కార్పోరేట్ల ప్రభుత్వమని రుజువు చేసుకొంటున్నది. వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్లు ఇవ్వాలని డిమాండు చేస్తున్నాము. ఇవ్వకుంటే ప్రత్యక్ష ఆందోళనకు రైతులు తరుపున పోరాడుతామని CPM మండల కమిటీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో కటికాల వెంకటేశ్వర్లు , బి.సి.భాస్కర్, టి.దేవదానం పాల్గొన్నారు.

No comments:

Post a Comment