Pages

Wednesday, January 25, 2017

మొలకెత్తిన పెసలుతో లాభాలెన్నో..!

                పెసలు అందరికీ తెలిసిన బలవర్థక ఆహారం. పెసరపప్పును కూడా అంతా ఉపయోగిస్తుంటారు. అయితే మొలకెత్తిన పెసలు వల్ల ఆరోగ్యానికి మంచి మేలు చేకూరుతుందని, శరీరంలో పేరుకుపోయే కొవ్వును ఇవి తొలగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
మొలకెత్తిన పెసలలో అధికంగా ఉన్న డైటరీ ఫైబర్‌ కొవ్వును కరిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.మొలకెత్తిన పెసలను తింటే త్వరగా ఆకలి వేయదు. దీంతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా ఆహారాన్ని తగ్గించి, బరువు కూడా తగ్గవచ్చు. డైటరీ ఫైబర్‌ అధికంగా ఉన్న కారణంగా ఇవి మలబద్ధకం సమస్యను పోగొడతాయి. తిన్నది సరిగ్గా జీర్ణం అయ్యేలా చూస్తాయి.శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొలకెత్తిన పెసలలో ఉన్నాయి.విటమిన్‌ ఎ, బి, సి, డి, ఇ, కె, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, విటమిన్‌ బి6, ఫాంటోథెనిక్‌ యాసిడ్‌ వంటివి మొలకెత్తిన పెసలలో సమృద్ధిగా లభిస్తాయి. దీనిని సంపూర్ణ పౌష్టికాహారంగా చెప్పవచ్చు. మొలకెత్తిన పెసలను తీసుకోవడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు పోతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తహీనత తొలగిపోతుంది.రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. మధుమేహం ఉన్న వారికి వీటివల్ల మేలు కలుగుతుంది.శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను తొలగించే యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.వృద్ధాప్య ఛాయలను మొలకెత్తిన పెసలు దరిచేరనివ్వవు. గ్యాస్‌, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలను ఇవి పూర్తిగా నివారిస్తాయి.

ఖర్జూరంతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!!

                 ప్రతిరోజూ పది కర్జూరాలు తింటే అనారోగ్యం దరి చేరదు. అలాగే శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరంలో మెడిసినల్‌ విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి గ్రేట్‌గా సహాయపడతాయి. అలాగే పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉండి, సన్నగా ఉండేవారికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి. అలాగే కర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి, ఉదయం మిక్సీలో వేసి జ్యూస్‌లా తయారుచేసి తాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రిషియన్స్‌ అధికంగా అందుతాయి. దాంతో రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తి అందుతుంది.
చర్మానికి మంచి మెరుపు వస్తుంది : ఖర్జూర జ్యూస్‌ను రెగ్యురల్‌గా తాగడం వల్ల చర్మానికి పోషణ బాగా అందుతుంది. దాంతో చర్మానికి మంచి మెరుపు వస్తుంది.
చర్మంకు పోషణ అందుతుంది: ఖర్జూరాల జ్యూస్‌ రెగ్యులర్‌గా తాడం వల్ల రక్తంలో ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ పెరుగుతుంది. కాబట్టి, ఖర్జూర జ్యూస్‌ను బయట కొనడం కంటే ఇంట్లో స్వయంగా తయారుచేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఫ్రెష్‌ జ్యూస్‌ వల్ల పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.
జుట్టుకు అద్భుత ప్రయోజనం : రోజూ కొన్ని ఖర్జురాలను తినడం లేదా వాటితో తయారుచేసిన జ్యూస్‌ తాగడం వల్ల జుట్టుకు అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే జుట్టు మృదువుగా తయారవుతుంది.డేట్స్‌ జ్యూస్‌ జుట్టు ఆరోగ్యంగా పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది . జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్స్‌ ఎక్కువ అందిస్తుంది. ముఖ్యంగా విటమిన్‌ బిని ఎక్కువ అందిస్తుంది.
సహజ ప్రసవానికి లేబర్‌ : గర్భదారణ సమయంలోనే కాదు, గర్భం పొందక ముందు నుండే రెగ్యులర్‌ డైట్‌లో ఖర్జూర చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. ప్రసవంసహజంగా జరగుతుంది. మహిళల్లో హార్మోన్‌ ఆక్సిటోసిన్‌ను క్రమబద్ధం చేస్తుంది.
బరువు పెరగడానికి సహాయపడుతాయి: మరీ సన్నగా ఉన్నవారు. బరువు పెరగాలని కోరుకునే వారు, ఖర్జూర జ్యూస్‌లోని షుగర్‌, కార్బోహైడ్రేట్స్‌ బరువు పెరగడానికి సహాయపడుతాయి.
మలబద్ధక నివారిణి : పురాతన కాలం నుంచి, మలబద్దక నివారణకు డేట్స్‌ను రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకునే వారు. ఖర్జూరా పీచుల్లో అధికంగా ఉంటం వల్ల ఇది గ్రేట్‌ లాక్సేటివ్‌ గా పనిచేస్తుంది.
ఆరోగ్య దంత సంరక్షణకు : ఖర్జూర జ్యూస్‌లో క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌ ఎక్కువ. దంతాలు, ఎముకలను ప్రోత్సహించడానికి ఇది సహాయపడుతుంది.ఎర్ర రక్తకణాలు వృద్దికి సహాయపడుతుంది


సిపిఎం నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు...రాష్ట్ర కార్యదర్శి పి. మధు గారితో
Image may contain: 16 people, people sitting

Thursday, January 19, 2017

Wednesday, January 18, 2017

Tuesday, January 17, 2017

- అవినీతిపరులపై చర్యలకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన వైనం 
- సిఎం పేషీ అధికారిపైనే అనుమానాలు 
- విచారణకు సబ్‌ కమిటీని వేసిన పిఎసి 
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:

Monday, January 16, 2017